నాసా మిషన్ మరోసారి వాయిదా.. సునీత రాక మరింత లేట్
తాజాగా నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరటానికి వీలుగా క్రూ 10 మిషన్ సిద్ధమైంది.;
మూడోసారి రోదసిలోకి వెళ్లి.. అక్కడే చిక్కుకుపోయినట్లుగా మారింది భారత సంతతి వ్యోమగామి సునీతా విలియన్స్. వారం రోజుల మిషిన్ కోసం అంతరిక్షానికి వెళ్లిన సునీతా విలియన్స్ ఇప్పటికి తొమ్మిది నెలలు కావొస్తోంది. ఇప్పటికే పలుమార్లు ప్రయోగానికి రంగం సిద్ధం చేయటం.. సాంకేతిక సమస్యలతో ఆగిపోవటం లాంటివి తరచూ జరుగుతున్నాయి. తాజాగా నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరటానికి వీలుగా క్రూ 10 మిషన్ సిద్ధమైంది.
అయితే.. ప్రయోగానికి కాస్త ముందుగా సాంకేతిక సమస్యలు తలెత్తటంతో ప్రయోగాన్ని నిలిపేశారు.హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య ఉత్పన్నం కావటంతో వారం వ్యవధిలో మరో ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో. వ్యోమగాముల రాక మరింత ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. 2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. సునీతా విలియమ్స్.. బచ్ విల్మోర్ లు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది.
స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో వ్యోమగాముల్ని తీసుకురాకుండానే భూమికి వచ్చేసింది. అప్పటి నుంచి సునీతా విలియమ్స్.. విల్మోర్ లు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పని చేస్తోంది. వీరిద్దరిని భూమి మీదకు తీసుకురావాలంటే మరికొందరిని ఐఎస్ఎస్ కు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రయోగానికి స్పేస్ ఎక్స్ కాస్త సమయం అడగటం.. సాంకేతిక సమస్యలు సునీతా అండ్ కో తిరిగి వచ్చేందుకు ఆలస్యమవుతున్నది. తాజా ప్రయోగం కూడా నిలిచిపోవటం.. మరో వారం తర్వాత నిర్వహించే ప్రయోగం అనంతరం.. సునీత భూమి మీదకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. ఆ లోపు మరెన్ని ట్విస్టులు చేసుకుంటాయో?