ఒక్క స్పీచ్ తో రాహుల్ నెక్స్ట్ లెవెల్
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 18వ లోక్ సభ తొలి సమావేశాల్లోనే అదరగొట్టేశారు అన్న టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 18వ లోక్ సభ తొలి సమావేశాల్లోనే అదరగొట్టేశారు అన్న టాక్ వినిపిస్తోంది. ఏకంగా ఆయన గంటా నలభై నిముషలు గుక్కతిప్పుకోకుండా సుదీర్ఘ ప్రసంగం చేశారు. గత పదేళ్ళుగా మోడీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలను అన్నింటినీ అన్నీ ఆయన పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టారు.
రాహుల్ స్పీచ్ ని చాలా సార్లు మోడీ షాలు కూడా అడ్డుకునే ప్రసంగం చేశారు అంటే ఆయన వాగ్దాటి ఆ దూకుడు ఏ రేంజిలో ఉందో అర్ధం అవుతుంది అంటున్నారు. ఇక గత పదేళ్ళుగా చూస్తే మోడీ ముందు ధైర్యంగా మాట్లాడే నాయకుడు అయితే ఎవరూ లేరనే చెప్పాలి. అలా పార్లమెంట్ లోపలా బయటా సాగిపోయింది. ఎందుకంటే మోడీ చేతిలో డబుల్ ఇంజన్ గా చెప్పుకునే ఈడీ సీబీఐ ఉన్నాయని చెప్పుకుని భయపడుతూండేవారు. చాలా మంది రాజకీయ నాయకులు ఎందుకొచ్చిన తంటా అని సైడ్ అయిపోయేవారు.
ఇక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని దేశమంతా పప్పు అని అంటూ వచ్చింది. దాని వెనక బీజేపీ కూడా ఉందని అంటారు. బీజేపీ సెటైర్లు వేస్తూ రాహుల్ ని జనం దృష్టిలో ఏమీ కాకుండా చేశారు అని అంటారు. అయితే అదే పప్పు కాస్తా ఇపుడు ఒప్పు అయింది. అంతే కాదు నిప్పు కణికగా మారి అధికార బీజేపీని విమర్శలతో కడిగిపారేస్తున్న వైనాన్ని కూడా దేశమంతా చూస్తున్నారు.
తాజా రాహుల్ గాంధీ స్పీచ్ చూసిన ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ చూసినా దేశానికి నెక్స్ట్ లెవెల్ అపొజిషన్ లీడర్ దొరికారు అని అంటున్నారు. లోక్ సభలో వంద నిముషాలకు పైగా రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని తూర్పారా పట్టడమే కాకుండా ఒక స్థాయిలో చెడుగుడు ఆడుకున్నారు అని అంటున్నారు. ఒక విధంగా రాహుల్ గాంధీ స్పీచ్ తరువాత ఆయన మీద దేశం ఏర్పరచుకున్న పాత అభిప్రాయాలు పోయాయి. ఆయనను దేశానికి ఆశాకిరణంగా చూస్తున్నారు.
హిందూత్వ మీద రాహుల్ ఇచ్చిన డెఫినిషన్ కూడా బాగుంది అని అంటున్నారు. హిందూత్వని కేవలం బీజేపీ ఆరెస్సెస్ మోడీ మాత్రమే గుత్తకు తీసుకోలేదని రాహుల్ చెప్పిన విధానం బాగుంది. హిందూత్వ అంటే ఏమిటో కూడా రాహుల్ దేశానికి ఇచ్చిన సందేశం కూడా చర్చకు దారి తీస్తోంది.
అయితే మోడీ దానిని ట్విస్ట్ చేసి హిందూత్వ మీద రాహుల్ దాడి అని కొత్త ఆరొపణలు చేయడమూ అంతా చూస్తున్న నేపధ్యం ఉంది. హిందూత్వను రాహుల్ గాంధీ అవమానించారు అని చెప్పినా దేశంలో పెద్దగా స్పందన లేదు. ఎవరూ నమ్మడం లేదు అంటే రాహుల్ చెప్పిందేంటో వారికి బాగానే అర్ధం అయింది అని అంటున్నారు.
ఇక లోక్ సభలో మోడీ ఇచ్చిన రిప్లై కూడా రాహుల్ గాంధీకి కౌంటర్ తప్ప మూడవ సారి గెలిచిన ప్రధానిగా దేశానికి ఇచ్చిన సందేశం కొత్తగా ఏమీ లేదు అని అంటున్నారు. రాహుల్ గాంధీవి పిల్ల చేష్టలు అని ఆయన చిన్న పిల్లోడు అని మోడీ వేసిన సెటైర్లు కూడా జనాలకు కనెక్ట్ కావడం లేదు.
ఒక విధంగా చెప్పాలంటే 2014లో అయితే ఇవి బాగా జనాల్లోకి వెళ్ళేవి. కానీ ఇపుడు 2024 అంతా అన్నీ అర్ధం చేసుకుంటున్న నేపధ్యం ఉంది. పైపెచ్చ్చు బీజేపీ గ్రాఫ్ తగ్గుతోంది. రాహుల్ ఇమేజ్ పెరుగుతోంది. రాహుల్ గాంధీ దేశమంతా భారత్ జోడో యాత్రలు చేసి తనను తాను రుజువు చేసుకున్నారు.
ఆయన మాట నడక నడత అన్నీ పూర్తిగా మారిపోయాయి. రాహుల్ గాంధె పరిపక్వత సాధించిన నేతగా జాతి ముందు కనిపిస్తున్నారు. ఆయన ఫ్యూచర్ పీఎం గా కూడా చాలా మంది భావిస్తున్న నేపధ్యం ఉంది. ఈసారి లోక్ సభలోనే ఇండియా కూటమి ఎన్డీయే కూటమి దరిదాపుల్లోకి వచ్చేసింది. అలా పూర్తి ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్న నేపధ్యం విపక్షానికి ఉంటే అధికార పక్షం ఆత్మ రక్షణలో పడుతోంది అని అంటున్నారు.
దీంతో పాటు దేశంలో మారిన ప్రజల మూడ్ కూడా విపక్ష నేత రాహుల్ ప్రసంగానికి ఆకర్షితులు కావడానికి దారి తీస్తోంది అని అంటున్నారు. ఈ సమయంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం జన రంజకమైన పాలన చేసి ప్రజలను మెప్పించడమే ఆప్షన్ గా ఉంది తప్ప విపక్షాల మీద ప్రత్యేకించి రాహుల్ గాంధీ మీద విమర్శల దాడి చేసుకుంటూ పోతే ఉపయోగం లేదని అంటున్నారు. పైగా అంతకంతకు రాహుల్ గ్రాఫ్ పెంచేదిగానే అది ఉంటుందని అంటున్నారు.