ఇండియా కూటమిలో సీన్ : రాహుల్ ప్రధాని అవుతారా ?

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో యాభై దాకా ఎంపీ సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి వందకు పైగా సాధించాలని ఆశపడుతోంది

Update: 2024-05-25 04:14 GMT

ఇండియా కూటమి కి అధికారం మీద ఆశలు పెరిగాయి. ఎన్డీయే కూటమి పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఎంతో కొంత సొమ్ము చేసుకునే పరిస్థితి ఈసారి ఎన్నికల్లో కనిపిస్తొంది. ఢిల్లీ నుంచే అది ఆరంభం అయినట్లుగా ఉంది. ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లనూ గత ఎన్నికల్లో గెలుచుకున్న బెజేపీకి ఈసారి ఆప్ కాంగ్రెస్ మైత్రి భారీ షాక్ ఇచ్చేలా ఉంది. అలాగే పంజాబ్, హర్యానా, గుజరాత్, యూపీ మహారాష్ట్ర, పశ్చిన బెంగాల్, బీహార్ లాంటి చోట్ల ఎండీయేను ఇండియా కూటమి సవాల్ చేయనుంది.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో యాభై దాకా ఎంపీ సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి వందకు పైగా సాధించాలని ఆశపడుతోంది. ఒక దశలో 150 దాకా లెక్క వేసుకుంది. అయితే కూటమి మిత్రులు అంతా కలిసి మరో 140 సీట్లు సాధించినా తమదే అధికారం అన్నది కాంగ్రెస్ లెక్క. ఇవన్నీ పక్కన పెడితే ఇండియా కూటమికి ప్రధాని ఎవరు అన్నది తరచూ బీజేపీ నుంచి వస్తున్న ప్రశ్న.

దానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె జవాబు ఘాటుగా చెప్పారు. ఇండియా కూటమి గెలిస్తే అంతా కలసి చర్చించుకుంటామని సరైన అభ్యర్ధినే పెడతామని అన్నారు. కాంగ్రెస్ మదిలో మాట చూస్తే రాహుల్ గాంధీ అని ఉంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు చేసి తన పరపతిని పెంచుకున్నారు. అంతే కాదు ఆయన గతానికి కంటే భిన్నంగా దూకుడు చేస్తున్నారు.

మోడీకి అపోజిట్ ఎవరు అంటే రాహుల్ పేరే ఠక్కున వస్తుంది. ఇక ఇండియా కూటమిలో తీసుకుంటే అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఎపుడూ ఉంటుంది. మమతా బెనర్జీ బెంగాల్ సీట్లు మెజారిటీ గెలిచినా లాక లాలూ ఆర్జేడీ బీహార్ లో ఎక్కువ సాధించినా ఇక యూపీలో ఎస్పీ అధినేత అఖిలేష్ గరిష్టంగా సీట్లు తెచ్చినా మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాక్రే కానీ ఎన్సీపీ నేత శరద్ పవార్ కానీ సీట్లు దక్కించుకున్నా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ పంజాబ్ సహా దేశంలో పోటీ చేస్తునన్ 21 సీట్లలో అన్నీ గెలిచినా తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలి టోటల్ నంబర్ తన వెంట తెచ్చుకున్నా కాంగ్రెస్ కంటే కూడా వీరు ఎవరూ నంబర్ గేమ్ లో ముందుకు పోలేరు.

పైగా కూటమికి పెద్దన్నగా ఉన్న పార్టీ నుంచి ప్రధాని అభ్యర్ధి ఉంటేనే స్థిరత్వం వస్తుంది అని అంటారు. ఆ విధంగా చూస్తే రాహుల్ కి ఇదే చాన్స్ అని అంటున్నారు. ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ వందకు పైగా సీట్లు సాధించి కూటమిలో ఇతర పార్టీలు అన్నీ మరో 140 సీట్లు సాధిస్తే మిగిలిన 33 సీట్లకు మద్దతు ఇవ్వడానికి కూడా ఆ సమయానికి బయట నుంచి వచ్చే పార్టీలు ఉంటాయని అంటున్నారు. అనూహ్యమైన మద్దతు కూడా దక్కవచ్చు అని అంటున్నారు.

ఈసారి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకి పూర్తి మెజారిటీ దక్కాలి. అంటే 273 సీట్లు రావాల్సిందే అని అంటున్నారు. అలా కాకుండా ఏ మాత్రం తగ్గినా అపుడు ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీయే కూటమిని ఎంచుకోమంటే మార్పు కోసం కచ్చితంగా ఇండీ కూటమి వైపే తటస్థ పార్టీలు మొగ్గుతాయని అంటున్నారు. ఆ తటస్థ పార్టీలు కూడా రాహుల్ ప్రధానిగా అంగీకరించే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే రాహుల్ ప్రధాని ఆశలు ఈ దఫా నెరవేరుతాయా అంటే ఆరు విడతల పోలింగ్ తరువాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News