రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ టీం ఆపరేషన్.. భారీగా నేరగాళ్ల పట్టివేత

రాజస్థాన్‌లోని పింప్రీ చించ్ వాడ్ పోలీస్‌స్టేషన్ పరిధినలో ఓ సీనియర్ సిటిజన్‌ను కోటి రూపాయలకు పైగా మోసం చేశాడు ఓ నిందితుడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-10-01 07:30 GMT

దేశవ్యాప్తంగానూ సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. సామాన్యుల నుంచి బడాబాబుల వరకూ సైబర్ క్రైం బారిన పడుతూనే ఉన్నారు. వేలు, లక్షలు, కోట్లు కోల్పోతున్నారు. ఇక తెలంగాణలోనూ నిత్యం పదుల సంఖ్యలో సైబర్ బారిన పడుతున్నారు. వృద్ధుల నుంచి మొదలు బ్యాంక్ ఎంప్లాయీస్ వరకూ మోసపోతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే.. కొంత మంది సైబర్ బారిన పడి మోసపోయామని పోలీసులు ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఎవరికీ చెప్పుకోలేక పోతున్నారు. సీబీఐ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, పోలీసుల మంటూ చెబుతూ నేరగాళ్లు బెదిరిస్తుండడం గమనార్హం.

సైబర్ క్రైం పై నిత్యం ప్రభుత్వాలు, పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి జాతాలు నిర్వహించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల మాటలు విని మోసపోతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశపడి.. ఏటిఎం నంబర్లు, బ్యాంక్ ఖాతాల నంబర్లు, ఓటీపీలు చెబుతూ డబ్బులు కోల్పోతున్నారు. అయితే.. డబ్బులు కోల్పోయాక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎంతో కొంత రికవరీ చేసే అవకాశం ఉంటుంది. 24 గంటల్లోనే మోసాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చాలా సందర్భాల్లో వారు కూడా అవగాహన కల్పించారు.

ఇప్పటికే అలా చాలా మంది నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. చాలా వరకు డబ్బులను కూడా రికవరీ చేశారు. అయినప్పటికీ వారి నుంచి ఆ మోసాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు సైబర్ టీమ్ ఏకంగా రాజస్థాన్‌కు వెళ్లింది. ఆ రాష్ట్రంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. కాగా.. ఈ ఆపరేషన్‌లో పోలీసులు 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా చెక్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్‌లోని పింప్రీ చించ్ వాడ్ పోలీస్‌స్టేషన్ పరిధినలో ఓ సీనియర్ సిటిజన్‌ను కోటి రూపాయలకు పైగా మోసం చేశాడు ఓ నిందితుడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్‌కు చెందిన మయాంక్ అశోక్ కుమార్ గోయల్ తన స్నేహితులతో కలిసి ఎస్బీఐ, సీబీఐ ఉద్యోగులం అని చెప్పి మోసాలకు పాల్పడ్డారు. 60 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్ వీడియో కాల్ చేసి మనీల్యాండరింగ్ పేరిట బెదిరించారు. అతని బ్యాంక్ ఖాతా వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఖాతా నుంచి కోటి 8 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఆ డబ్బును గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలించినట్లు వెల్లడైంది. గోయల్ అరెస్టు కాగా.. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు డీఎస్పీ సందీప్ తెలిపారు. విచారణలో నగదును రికవరీ చేసి బాధితుడికి అందిస్తామని చెప్పారు. కాగా.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఈ రోజు మధ్యాహ్నం దీనికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.

Tags:    

Similar News