రజనీకాంత్ పంచ్ విజయ్ పార్టీపైనేనా?
ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న డీఎంకేని టార్గెట్ చేసి నిప్పులు కురిపిస్తున్నాడు.
తలపతి విజయ్ `తమిళగ వెట్రి కళగం` పార్టీతో 2026 ఎన్నికలకు సమాయత్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఒంటరిగా వెళ్తున్నాడా? పొత్తుతో వెళ్తున్నాడా? అన్నది క్లారిటీ లేదు గానీ వెళ్లడం మాత్రం పక్కా అని తేలి పోయింది. ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న డీఎంకేని టార్గెట్ చేసి నిప్పులు కురిపిస్తున్నాడు. ఛాన్స్ దొరికనప్పుడల్లా ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడు. విజయ్ కి జనబలం ఉండటంతో భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది.
విజయ్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. అనుకూలమైన పోస్టులతో వాతావరణం మరింత వెడెక్కుతోంది. డీఎంకే పార్టీ మూసుకోవాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి. ఈ నేపథ్యంలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ...విజయ్ పార్టీపై పంచ్ వేసినట్లు కనిపిస్తుంది.
డీఎంకే మద్దతు పలుకుతూ ఆయన రజనీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రజనీ ఏమన్నారంటే?... `డీఎంకే పార్టీ ఓ మర్రి చెట్టు లాంటింది. ఎలాంటి తుఫానైనా తట్టుకుని నిలబడుతుంది. ఎదుర్కుంటుంది. ఆ మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరు. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ నాయకులు చేసే విమర్శలు ఇతరులను బాధించకూడదు.
మాజీ ముఖ్యమంత్రి, కళాకారుడు కరుళానిధికి ఎదురైన సమస్యలు ఇంకెవరికైనా ఎదురై ఉంటే? కనుమరు గయ్యేవారు. కరుణానిధి పాలనలో ప్రజలు సంక్షేమం కోసం కృషి చేసారు. సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత వీజీ కాదు. స్టాలిన్ సమర్దవంతమైన నాయకుడు. వరుసగా పార్టీకి విజయాలు అందిస్తున్నారు. ఆయనకు నా అభినందనలు` అని అన్నారు.