తెలంగాణా అసెంబ్లీలో ఎమ్మెల్యే తొడకొట్టుడు సీన్

పరిగి శాసనసభ్యుడైన రామ్మోహన్ రెడ్ది సభలో ప్రసంగిస్తూ సహజంగానే విపక్ష బీఆర్ఎస్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-27 17:12 GMT

అసెంబ్లీ అన్నాక వాదోపవాదాలు ఉంటాయి. వాటితో పాటుగా ఆవేశకావేశాలు ఉంటాయి. కానీ తొడగొట్టడం సీన్లు కూడా ఉంటాయా అంటే ఉంటాయని నిరూపించారు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. పరిగి శాసనసభ్యుడైన రామ్మోహన్ రెడ్ది సభలో ప్రసంగిస్తూ సహజంగానే విపక్ష బీఆర్ఎస్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సభలో బీఆర్ఎస్ తీరు మీద కూడా ఆయన మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ పాలన బాగా ఉందని ఆయన కితాబు ఇచ్చారు. మీరు ప్రభుత్వానికి సహకరించండని ఆయన కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని అనుకుంటే తొడగొట్టి చెబుతున్నా కాపాడుకుంటామని సడెన్ గా తొడగొట్టి మరీ రామ్మోహన్ రెడ్డి సభలో సంచలనం రేపారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు నా సవాల్ కి సిద్ధమా అని ఆయన తొడగొట్టడంతో సభలో అంతా విస్మయం చెందారు. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు ప్రజల మేలు కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరారు.

ఒకవేళ అలా కాకపోతే పడగొట్టాలని చూసుకున్నా మేము రెడీ అని ఆయన అనడం విశేషం. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుగా ఫిరాయిస్తున్న వేళ బీఆర్ ఎస్ కి బలం తగ్గిపోతున్న వేళ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ నేతలు ఎలా అంటారు అని కూడా ప్రశ్నలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లో అయితే ఈ తరహా అనుమానాలు ఉన్నా ఇపుడు సీఎం రేవంత్ రెడ్డి అంతా సర్దుబాట్లు చేసుకుంటున్నారు.

మజ్లీస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారు. మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి డిప్యూటీ సీఎం కూడా ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. తన రాజకీయ చతురతను చూపిస్తూ రేవంత్ రెడ్డి బలమైన నేతగా కాంగ్రెస్ లో తయారయ్యారు. ఆయనకంటూ అక్కడ కొంత బలం ఉంది. రేపటి రోజున ఏమి జరిగినా ఆయన సీటుకు ప్రమాదం లేని పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేసిన పడగొట్టుడు తొడగొట్టుడు వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్ ఇంకా ఆ డౌట్లు ఉన్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది.

అంకెల గేమ్ తోనే రాజకీయాలు సాగుతాయి కాబట్టి ఆ విధంగా చూస్తే కనుక కాంగ్రెస్ కి తెలంగాణాలో వచ్చిన ముప్పు ఏమీ లేదని అంటున్నారు. మరి పరిగి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఆయన రేవంత్ రెడ్డి పట్ల తన విధేయతను మరింతగా చాటుకోవడానికే అని అంటున్నారు.

Tags:    

Similar News