'రతన్ అన్న' చివరి చూపు కోసం వీల్ చైర్ లో... జిమ్మీ గురించి తెలుసా?

రతన్ టాటా తాత రతన్ జీ టాటా దత్తపుత్రుడైన నావల్ టాటా.. సోనూ అనే అమ్మాయిని పెండ్లి చేసుకోగా.. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు కలిగారు.

Update: 2024-10-10 13:03 GMT

రతన్ టాటా తాత రతన్ జీ టాటా దత్తపుత్రుడైన నావల్ టాటా.. సోనూ అనే అమ్మాయిని పెండ్లి చేసుకోగా.. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు కలిగారు. వారి పేర్లు రతన్ టాటా, జిమ్మీ! అయితే... వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోలేదు. అయితే వీరి చిన్నతనంలోనే పేరెంట్స్ విడిపోయరు. ఆ సమయంలో వీరి తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు.

ఇలా.. రతన్ టాటా - జిమ్మీ ల తండ్రి నావల్ టాటా.. సీమోన్ అనే స్విస్ అమ్మాయిని మరో పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు ఒక కుమారుడు కలిగారు. ఆయన పేరు నోయెల్ టాటా. ఆయనకు ముగ్గురు సంతానం. అంటే... రతన్ టాటాకు సొంత తమ్ముడు జిమ్మీతో పాటు, నోయెల్ టాటా అనే సవతి సోదరుడు కూడా ఉన్నారు.

వాస్తవానికి... రతన్ టాటాకు నోయెల్ అనే సోదరుడు ఉన్నారని బాగా తెలుసు కానీ... జిమ్మీ అనే సొంత సోదరుడు ఉన్నారనే విషయం చాలా తక్కువమందికి తెలుసని అంటారు. అయితే గత ఏడాది జనవరిలో జిమ్మీ పుట్టినరోజున రతన్ టాటా వెళ్లడం, తమ్ముడితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జిమ్మీ గురించి బయట ప్రపంచానికి బాగా తెలిసింది.

అవును... జిమ్మీ గురించి బయట ప్రపంచానికి బాగా తెలిసింది తన అన్నతో రతన్ టాటాతో కలిసి ఫోటో దిగిన తర్వాతే! అయితే నేడు తాను ఎంతో ప్రేమించిన, తనను ఎంతో ప్రేమించిన సోదరుడు రతన్ టాటా మృతి చెందిన వార్త తెలుసుకున్న జిమ్మీ.. వీల్ చైర్ లో వెళ్లి నివాళి అర్పించారు.

కాగా... రతన్ టాటా సోదరుదు జిమ్మీ టాటాకు డబ్బుపై కానీ, విలాసాలపై కానీ పెద్దగా ఆసక్తి లేదట. టాటా గ్రూపులో వాటా కలిగి ఉన్నా.. కుటుంబ వ్యాపారంపై జిమ్మీకి అస్సలు ఆసక్తిలేదని చెబుతారు. సోదరుడు రతన్ టాటాలాగే అరుదైన వ్యక్తిత్వం కలిగిన జిమ్మీ.. ముంబైలో ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో ఉంటూ.. నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు.

కనీసం సెల్ ఫోన్ కూడా వాడని ఆయన.. పత్రికలు, పుస్తకాలు చదువుతూ బయట ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటారు. ఆయన ఇల్లు వదిలి బయటకు వెళ్లిన సందర్భాలు కూడా చాలా తక్కువే అని చెబుతారు. ఈ రోజు తన సోదరుడికి అంతిమ వీడ్కోలు పలకడం కోసం వీల్ చైర్ లో వచ్చారు!

Tags:    

Similar News