చంద్రబాబు ఫోటో నేలకేసి కొట్టిన రాయపాటి... లోకేష్ కు ధమ్మున్న సవాల్!

ఆ ఎన్నికల్లో గెలిచి నిలవని పక్షంలో భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు

Update: 2024-01-12 15:56 GMT

వచ్చే ఎన్నికలు టీడీపీ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎన్నికల్లో గెలిచి నిలవని పక్షంలో భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా రాయపాటి రంగారావు రాజీనామా చేస్తూ.. చంద్రబాబు, లోకేష్ పై నిప్పులు చెరిగారు.

Full View

అవును... ఇప్పటికే విజయవాడ లోక్ సభ స్థానంలో బలమైన అభ్యర్థిగా ఉండి, 2019లో జగన్ వేవ్ లో సైతం గెలిచిన కేశినేని నాని రాజీనామా చేసి, వైసీపీలో చేరబోతున్నారు. అది టీడీపీకి కృష్ణాజిల్లాలో బలమైన దెబ్బ అని చెబుతున్న వేళ... గుంటూరు జిల్లాలో కూడా షాక్ తగిలింది. ఇందులో భాగంగా రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు!

విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేశినేని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. అయితే... రాను రానూ చంద్రబాబు విధానాలు ఏమాత్రం ఆమోదించేవిగా ఉండకపోవడం, యూస్ అండ్ త్రో పాలసీ తీవ్రం అవుతుండటంతో ఆ నేతలు సైకిల్ దిగిపోతున్నారు. ఈ సమయంలో ఇది టీడీపీకి కోలుకోలేని దెబ్బ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే... తన రాజీనామా సందర్భంగా రాయపాటి రంగారావు మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడక ముందు గోడకున్న చంద్రబాబు ఫోటోని తీసి నేలకేసి కొట్టిన రంగారావు అనంతరం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా చంద్రబాబుని పరుష పదజలంతో దూషించారు.

ఇందులో భాగంగా... చంద్రబాబు నాయుడు, లోకేష్ తన కుటుంబానికి చాలా అన్యాయం చేశారు అని మొదలుపెట్టిన రంగారావు... ఎన్నికలకు తమవద్ద నుంచి 150 కోట్ల రూపాయలు తీసుకున్నారని అన్నారు. ఇందులో ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారనేది తమవద్ద లెక్కలు ఉన్నాయని.. తమవద్ద నుంచి లోకేష్, చంద్రబాబులు ఒకరికి తెలియకుండా ఒకరు సబ్ కాంట్రాక్టులు తీసుకున్నారని తెలిపారు!

సోమవారం పోలవరం అని చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, వాళ్లోక బేవార్స్ అని రాయపాటి ఫైరయ్యారు. అసలు టీడీపీ అనేది ఒక పార్టీ కాదని, అది ప్రజల అవసరాల కోసం లేదని, అది వాళ్ల బాగోగుల కోసం నడుపుతున్న వ్యాపార సంస్థ అని నిప్పులు కక్కారు.

2014 నుంచి 2019 వరకూ లక్ష ఉద్యోగాలు ఇచ్చనని చెబుతున్న లోకేష్.. కియా కంపెనీ నేనే తెచ్చారని చెప్పుకునే చంద్రబాబు.. రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. రాయలసీమ నుంచి అసలు మంగళగిరి ఎందుకు వచ్చావని లోకేష్ ను ప్రశ్నించిన ఆయన... ధమ్ము ధైర్యం ఉంటే రాయలసీమకు పోయి అక్కడ పోటీ చేయాలని సూచించారు.

2019లో ఎంత హేమాహేమీలను పెట్టినా గెలవకపోవడానికి కారణం ఏమిటని ఆలోచించారా అని ప్రశ్నిస్తూ.. ఇంటింటికీ మంచినీటి ప్రాజెక్టు కోసం అడగడానికి వెళ్తే... చినబాబుని అడగమని చంద్రబాబు చెప్పాడని, అసలు చినబాబు ఎవడని, ఆ చినబాబు ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచాడా అని ప్రశ్నిస్తూ ఎద్దేవా చేశారు.

ఇక ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటినుంచీ పార్టీని నమ్ముకున్న వారు ఉన్నారు.. వాళ్ల కోసం ఏమి చేశారో చెప్పాలని చంద్రబాబును రంగారావు సూటిగా ప్రశ్నించారు. పార్టీని నమ్ముకుని అప్పులపాలైపోయినవారు ఎంఓ మంది ఉన్నారని గుర్తుచేశారు. ఇదే సమయంలో.. అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే పచ్చి మోసం అని, నీరూ - చెట్టు పథకం కింద ఎంతో దోచుకు తిన్నారని నిలదీశారు!

అసలు మంగళగిరిలో లోకేష్ ఎట్లా గెలుస్తాడో చూస్తానంటూ సవాల్ చేసిన రంగారావు... గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చంద్రబాబు, లోకేష్ ఎక్కడ పనిచెయ్యనివ్వలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీలకు ఆయన శాపనార్ధాలు పెడుతూ నిప్పులు చెరిగారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

Tags:    

Similar News