రియల్ లైఫ్ పుష్ప అరెస్టయ్యాడు..మీమ్స్

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అరెస్టుపై రకరకాల మీమ్స్ వస్తున్నాయి.

Update: 2024-12-13 12:00 GMT

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం 1000 కోట్లు కొల్లగొట్టి దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ కలెక్షన్ల సునామీ రేపింది. ఆ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంధ్య ధియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు కావడంతో డల్ అయ్యారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అరెస్టుపై రకరకాల మీమ్స్ వస్తున్నాయి. పుష్ప-2 చిత్రంలో అల్లు అర్జున్ ఒక్కసారి కూడా అరెస్టు కారని, కానీ, నిజ జీవితంలో మాత్రం అరెస్టు కాక తప్పలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. పుష్ప రాజ్ తన అనుచరులను విడిపించుకునే క్రమంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులందరికీ రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని, కానీ, రియల్ లైఫ్ లో అలా కుదరదని మీమ్స్ పెడుతున్నారు.

అయితే, పుష్ప రియల్ లైఫ్ లో కూడా ఫైర్ అని, కాసేపట్లో ఆయనకు బెయిల్ వస్తుందని ఆయన ఫ్యాన్స్ కొందరు కామెంట్లు పెడుతున్నారు. షెకావత్ సార్ తో ఛాలెంజ్ చేసిన పుష్పరాజ్...రియల్ లైఫ్ లో కూడా పోలీసులతో అలాగే మాట్లాడారని, కనీసం చొక్కా మార్చుకునే టైం కూడా ఇవ్వడం అస్సలు బాగోలేదని అందరి ముందు అన్నారని ఆయన అభిమానులు అంటున్నారు.

Tags:    

Similar News