ఏపీలో కౌంటింగ్.. నేతలకే కాదు.. ప్రజలనూ భయపెడుతోందా?
ఇదిలావుంటే.. ఇప్పుడు కౌంటింగ్ రోజు.. ఎలాంటి విధ్వంసాలైనా జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడం.. మరో హెచ్చరి కగా మారింది.
కౌంటింగ్ ఎప్పుడు జరుగుతుందా? ఫలితం ఎప్పుడు వస్తుందా? అని ఒకప్పుడు ప్రజలు ఆశగా ఎదురు చూసేవారు. ఎందుకం టే.. వారి అభిమాన నాయకుల గెలుపుపై వారికి ఉండే అభిమానం అలాంటింది. కానీ, ఇప్పుడు ఏపీలో మాత్రం కౌంటింగ్ అంటేనే నాయకుల మాట ఎలా ఉన్నా.. ప్రజలు భయపడిపోతున్నారు. కౌంటింగ్ రోజు వస్తోందని అంటేనే.. ప్రజలు గుండెలు చేత బట్టు కునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠ మధ్య ఎన్నికలు జరిగాయి. పార్టీలు హోరా హోరీగా పోరాడుకున్నాయి. సవాళ్లు.. ప్రతిసవాళ్ల స్థానంలో విమర్శలు, వికృత వ్యాఖ్యలు కూడా చోటు చేసుకున్నాయి.
రెచ్చగొట్టుకున్నారు. రాళ్లేయాలని అన్నారు. ఇలా.. ఏపార్టీ కూడా తక్కువగా అయితే.. ఎన్నికల ముందు ప్రచారం చేయలేదు. అన్నీ ఆ తానులో ముక్కలే అన్నట్టుగా వ్యవహరించాయి. దీంతో ఎన్నికల రోజు.. అనంతరం మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో విధ్వంసాలు రాజ్యమేలాయి. అమాయక పార్టీ కార్యకర్తలపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కొందరు ఇప్పటికే అరెస్టయ్యారు. మరికొందరి కోసం .. పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారి కుటుంబాలను కూడా తీసుకువెళ్లి విచారిస్తున్నట్టు మరోవైపు ఆందోళన వ్యక్తమవుతోంది.
మొత్తంగా చూస్తే.. ఎన్నికల తర్వాత.. చెలరేగిన హింస తాలూకు పర్యవసానం నాయకులను భయ పెడుతోంది. ఇదిలావుంటే.. ఇప్పుడు కౌంటింగ్ రోజు.. ఎలాంటి విధ్వంసాలైనా జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడం.. మరో హెచ్చరి కగా మారింది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను అంచనా వేయడంలో విఫలమైన పోలీసులను పదవుల నుంచి తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం.. నిఘా వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే గుట్టు చప్పుడు కాకుండా.. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలను గత రెండు రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేయించినట్టు తాజాగా వెలుగు చూసింది.
వీరు ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఓటింగ్ రోజు రాష్ట్రంలోని 30-42 నియోజకవర్గాల్లో అల్లర్లకు అవకాశం ఉందని.. హత్యలు జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని.. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి. ఇది తాజాగా వెలుగు చూసింది. దీంతో రాష్ట్రంలో కౌంటింగ్‌కు ముందు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కౌంటింగ్ రోజు దాదాపు కర్ఫ్యూ వాతావరణం ఉండే అవకాశం కూడా ఉంటుందని.. డీజీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కౌంటింగ్ రోజు ఏమైనా జరిగే ఛాన్స్ ఉందని తెలియడంతో ప్రజలు బక్కటిల్లు తున్నారు. మరోవైపు.. అనుమానం ఉన్న ప్రతి వ్యక్తినీ అదుపులోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వచ్చే వారం రోజుల్లో ఎంతమందిని అదుపులోకి తీసుకుంటారో అనే బెంగ రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.