బ్రేకింగ్... సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట!

ఈ క్రమంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సమర్ధించింది.

Update: 2024-01-29 08:02 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇందులో భాగంగా... గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ దాఖలు చేసిన కేసులో హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే... దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ క్రమంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ తన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చేదిగా ఉండటం గమనార్హం. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐ.ఆర్.ఆర్.) వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపైనా సీఐడీ కేసులు నమోదు చేసింది.

అయితే... ఈ కేసులో సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉండటంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఈ క్రమంలో... ఆ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు కొన్ని ముఖ్యమైన అంశాల్ని పరిగణలోకి తీసుకోలేదని తెలిపింది.

ఈ క్రమంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సమర్ధించింది. ముందస్తు బెయిల్ వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఈ క్రమంలో... ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో... ఇది చంద్రబాబుకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News