బిగ్ బ్రేకింగ్... ఏపీ హైకోర్టులో లోకేష్ కు ఊరట!

ఈ క్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును గతనెల 9న ఉదయం ఆయన అనుమతితో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2023-10-12 09:57 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై సుమారు నెల రోజులు పైబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి అలా ఉంటే... ఇదే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నారా లోకేష్ కు తాజాగా ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో లోకేష్ ను నిందితుడిగా చూపలేదని సీఐడీ కోర్టుకు వివరించింది.

అవును... ప్రస్తుతం ఏపీలో ప్రధానంగా నాలుగు కేసులు హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మూడు కేసులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయనేది కీలక అంశం. ఇందులో ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులు అత్యంత కీలకమైనవిగా చెబుతున్నారు. ఇక నాలుగో కేసు.. అంగళ్లు అల్లర్ల కేసు. అది ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును గతనెల 9న ఉదయం ఆయన అనుమతితో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ ఆయన బయటకు రాలేదు. ఇప్పటికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. అవకాశం ఉన్న ప్రతీసారీ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ములాకత్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నారా లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ, కోర్టుకు వివరించింది. ముదాయిగా చూపని కారణంగా లోకేష్ ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తరుపు న్యాయవాది తెలిపారు. ఒక వేళ కేసులో పేరు చేర్చితే మాత్రం 41ఏ నిబంధనలు అనుసరిస్తామని కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో లోకేష్ పిటిషన్‌ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.

కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను వేసిన సంగతి తెలిసిందే. తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరడంతో ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే... ఈ పిటిషన్‌ పై సీఐడీ తరపు లాయర్లు కోర్టుకు తమ వివరణ ఇచ్చారు.

ఈ కేసులో నారా లోకేష్ ను అరెస్టు చేసే ఆలోచన ఇప్పుడు లేదని... అసలు కేసులో లోకేష్ పేరు చేర్చలేదని పేర్కొన్నారు. అయితే... కేవలం చంద్రబాబు కుటుంబీకులకు స్కాం ద్వారా అక్రమ డబ్బు అందిందని మాత్రమే పేర్కొన్నట్లు తెలిపారు. ఒకవేళ ముందు ముందు లోకేష్ పేరు చేర్చాలని సీఐడీ అనుకుంటే.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు.

మరోపక్క ఇదే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. అదేవిధంగా అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు లో విచారణ పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.

Tags:    

Similar News