రిమాండ్ ఖైదీ నంబర్ 7691 : అర్ధ సెంచరీ చంద్రుడు!

అయితే బాబు సీనియర్ టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి కానీ రిలీజ్ చేస్తున్న బులెటిన్ లో మాత్రం రిమాండ్ ముద్దాయి 7691 నారా చంద్రబాబునాయుడు అని రాస్తున్నారు.

Update: 2023-10-30 04:16 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జైలు జీవితం చూస్తూండగానే యాభై రోజుల మార్క్ ని చేరుకుంది. బాబు జనంలో ఉండకుండా మీటింగ్స్ ని అడ్రస్ చేయకుండా పార్టీ నేతలలో టెల్ ఫోన్ కాన్ఫరెన్స్ లు వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టకుండా అపుడే అర్ధ సెంచరీ సాగిపోయింది. కాలం చేసే మ్యాజిక్ ఏంటి అన్నది బాబు జైలు జీవితం కళ్లెదుట నిలిచి చెబుతోంది.

బాబు ఏంటి, జైలు ఏంటి, ఆయన కనీసం కోర్టు గడప కూడా తొక్కుతారా అది తమ జీవిత కాలంలో చూసేది సాధ్యమా అని అనుకున్న ఆయనకు అపర ప్రత్యర్ధులు సైతం విస్తుపోయేలా బాబు జైలు గోడల మధ్యన నలిగిపోతున్నారు. బాబు ఉండగా మనకేంటి అని అనుకున్న సొంత పార్టీకీ ఇది షాకింగ్ గా ఉంది. ఈ రోజుకీ చాలా మంది నేతలను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినా జైలు వైపు చూడకుండా బయటనే ఉంటున్నారు అంటే బాబు అండదండలు వారికి ఏ స్థాయిలో దక్కాయో అని చెబుతారు.

అలాంటిది సాక్ష్యాత్తు చంద్రబాబే ఇలా కావడం అంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి. ఇక బాబుకి జైలులో ఒక నంబర్ ఇచ్చారు. రిమాండ్ ఖైదీ నంబర్ 7691గా ఆయనను పేర్కొంటున్నారు. బాబు హెల్త్ బులెటింగ్ 50వ రోజు అయిన ఆదివారం రాత్రికి జైలు అధికారులు రిలీజ్ చేశారు.

సన్ ఆఫ్ ఖర్జూర నాయుడు అంటూ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లో బాబు బీపీ 130/80గా ఉంది. టెంపరేచర్ నార్మల్ గా ఉందని, పల్స్ 67/ఎం ఎం రెస్పిరేటరీ రేట్ 12/మిన్ అని పేర్కొన్నారు. లంగ్స్ క్లియర్ అని ఫిజికల్ యాక్టివిటీ గుడ్ అని రాశారు. ఓవరాల్ గా చూస్తే బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది అని పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాల తరువాత ప్రతీ రోజు జైలు అధికారులు బాబు ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే బాబు సీనియర్ టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి కానీ రిలీజ్ చేస్తున్న బులెటిన్ లో మాత్రం రిమాండ్ ముద్దాయి 7691 నారా చంద్రబాబునాయుడు అని రాస్తున్నారు.

ఇది నిజంగా టీడీపీ తమ్ముళ్ళకే కాదు చూసే వారికి కూడా చివుక్కుమనే విషయమే. బాబు స్టేచర్ ఉన్న లీడర్. దేశంలో ఈ రోజుకీ డైనమిక్ లీడర్ల లో ఒకరిగా ఉన్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన బాబు ఇలా జైలులో రిమాండ్ ముద్దాయిగా ఉండడం అంటే బాధాకరమే. కానీ కాలం ఎపుడు ఎలా ఉంటుందో చెప్పడానికి బాబునే ఉదాహరణగా తీసుకుంటే సరిపోతుందేమో.

బాబుకి ఈ సోమవారం అంటే అక్టోబర్ 30 చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఆ రోజున హైకోర్టు లో మధ్యంతర బెయిల్ తో పాటు బెయిల్ పిటిషన్ కూడా విచారణకు వస్తోంది. మరి హైకోర్టు బాబు విషయంలో ఏ నిర్ణయం ప్రకటిస్తుందో అన్నది అందరిలో ఆతృతగా ఉంది. అదే టైం లో బాబు హెల్త్ దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ అయినా వస్తుందా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News