వైఎస్సార్ వారసత్వం : రేవంత్ పంచ్ జగన్ కేనా ?

ఆయన వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Update: 2024-07-08 17:12 GMT

కుటుంబ సభ్యులకు రాజకీయ వారసత్వం రాదు, వైఎస్సార్ ఆశయాలు మోసేవారికి మాత్రమే ఆయన వారసత్వం దక్కుతుంది. వైఎస్సార్ పేరుతో రాజకీయ వ్యాపారాలు చేసేవారున్నారు అని వారంతా వారసులు కానే కారు అని తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలిటికల్ పంచులే వేశారు. వైఎస్సార్ కి అసలైన వారసురాలు వైఎస్ షర్మిల అని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ సర్పంచ్ పదవిని కూడా గెలవదు అని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు అని అయినా సరే ఏపీలో కాంగ్రెస్ జెండా మోసేందుకు షర్మిల ముందుకు వచ్చారన ఆయన అన్నారు.

షర్మిల ముళ్ళబాట ఎంచుకున్నారని ఆయన చెప్పారు. తండ్రి వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఆమె తపన పడుతున్నారు అని అన్నారు. వైఎస్సార్ ఇరవై ఏళ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి 2004లో సీఎం అయ్యారని అలాగే షర్మిల 2009 నుంచి పోరాడుతున్నారని ఆమె 2029లో తప్పనిసరిగా ఏపీకి సీఎం అవుతారని అన్నారు.

ఇక 2029 నాటికి దేశంలో రాహుల్ గాంధీ సీఎం అవుతారని చెప్పారు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం రాహుల్ ప్రధాని కావడం వైఎస్సార్ కోరిక అని ఆయన అన్నారు. అంతే కాదు కడప ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు.

ఈ మధ్య దాని మీద ప్రచారం సాగుతోంది. అదే జరిగితే కడపలో కాంగ్రెస్ ని గెలిపించుకుంటామని ఆయన అన్నారు. కడపలో ఊరూరా తిరిగి కాంగ్రెస్ జెండాను చేత బట్టి తాను పార్టీని గెలిపించుకుంటామని ఆయన చెప్పారు. ఎక్కడైతే కాంగ్రెస్ కి ఏపీలో దెబ్బ తగిలిందో అదే కడప నుంచి గెలిచి ఢిల్లీకి కడప పౌరుషం చాటి చెబుతామని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి వైఎస్సార్ వారసత్వం గురించి అలాగే రాజకీయం వ్యాపారం చేశారు అన్న దాని గురించి చేసిన హాట్ కామెంట్స్ జగన్ గురించేనా అన్న చర్చ సాగుతోంది. కుటుంబ సభ్యులుగా పుట్టినంత మాత్రాన వారసులు కాదని ఆయన ఆశయాలు మోసేవారే నిజమైన వారసులు అని కూడా రేవంత్ అనడం ఆయన ఈ సందర్భంగా వేసిన పంచులు అన్నీ జగన్ మీదనేనా అన్న చర్చ సాగుతోంది.

అదే సమయంలో ఏపీలో పాలకపక్షమే ఉందని విపక్షం లేనేలేదని రేవంత్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ కూడా చర్చకు వస్తున్నాయి. బీజేపీ అంటే బబు జగన్ పవన్ అని ఆయన నిర్వచనం చెప్పారు. ఈ ముగ్గురూ మోడీ బ్యాచ్ అని అందుకే ప్రజల పక్షాన పోరాడడానికి షర్మిల ఉన్నారని అన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ తో ఏపీలో జగన్ ని వైసీపీని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు అని అంటున్నారు.

Tags:    

Similar News