రేవంత్ సంచలన నిర్ణయాలు.. అమ్రపాలికి కీలక బాధ్యతలు!

అవును... తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 44మంది అధికారుల బదిలీలపై ఉత్తర్వ్యులు జారీ చేశారు.

Update: 2024-06-24 09:59 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో అధికార యంత్రాంగం విషయంలోనూ రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సుమారు 44మంది ఐఏఎస్ అధికారుల బదిలీలపై ఉత్తర్వ్యులు జారీ చేశారు. ఈ సమయంలో అమ్రపాలి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 44మంది అధికారుల బదిలీలపై ఉత్తర్వ్యులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా... గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో పలు కీలక శాఖల్లోనూ సీనియర్లకు ప్రధాన బాధ్యతలు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేశారు.

ఇందులో భాగంగా... పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గా నరసింహా రెడ్డి, జలమండలి ఎండీగా అశోక్ రెడ్డి, సెర్ప్ సీఈవోగా దివ్య, ఎక్సైజ్ బాధ్యతలు రిజ్వీకి అప్పగిస్తూ... జీ.హెచ్.ఎం.సీ. కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రోస్ ను ట్రాన్స్ కో ఎండీగా బదిలీచేశారు. ఇదే సమయంలో పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ ని నియమించారు.

ఇక యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించిన ప్రభుతం... దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ ను నియమించింది. ప్రధానంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, జీ.హెచ్.ఎం.సి. ఈవీడీఎం కమిషనర్ గా ఏవీ రంగనాథ్, హెచ్.ఎం.డి.ఏ కమిషనర్ గా సర్ఫరాజ్ అహ్మద్ ని నియమించారు.

ఈ సమయంలోనే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్ గా మహిళా ఐఏఎస్ అధికారి అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు.

Tags:    

Similar News