రేవంత్ రెడ్డికి అంతలా పాపులర్ చేస్తున్న బీజేపీ అండ్ బీఆర్ఎస్...!
ఆయన అప్పటికి ఒకసారి ఎమ్మెల్సీ రెండు సార్లు ఎమ్మెల్యే చేసి ఎంపీగా ఉన్నారు. ఆయన మంత్రి పదవులు కూడా నిర్వహించలేదు
రేవంత్ రెడ్డి ఇపుడు దేశంలోనే పాపులర్ పీపుల్ అన్న లేటెస్ట్ లిస్ట్ లో అగ్ర భాగాన ఉన్నారు. నాలుగు నెలల క్రితం వరకూ చూస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీకి చీఫ్ గా ఉన్నారు. ఆయన అప్పటికి ఒకసారి ఎమ్మెల్సీ రెండు సార్లు ఎమ్మెల్యే చేసి ఎంపీగా ఉన్నారు. ఆయన మంత్రి పదవులు కూడా నిర్వహించలేదు.
అయితే ఆయన బీఆర్ఎస్ ని ఢీ కొట్టి కాంగ్రెస్ ని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకుని వచ్చారు. దాంతో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తెలంగాణాకు సీఎం అయిపోయారు. తెలంగాణాకు కేసీఅర్ తరువాత సీఎం అయిన రెండవ వారుగా గుర్తింపు పొందారు. అంతే కాదు 55 ఏళ్ల వయసులో సీఎం అయి యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ గా గుర్తింపు పొందారు.
ఆ విధంగా దేశమంతా రేవంత్ రెడ్డిని చూసేలా చేసుకున్నారు. గత నాలుగు నెలల పాలనలో రేవంత్ రెడ్డి దూకుడుగా ఉంటున్నారు. ఆయన ప్రసంగాలు ఆయన బీఆర్ఎస్ మీద చేస్తున్న విమర్శలు బీజేపీ టార్గెట్ గా ఉన్న తెలంగాణలో ఆయన ఆ పార్టీని కట్టడి చేస్తున వైనాలు ఇవన్నీ కూడా ఎప్పటికపుడు జాతీయ స్థాయిలో హైలెట్ అవుతూ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి మంచి మాటకారి. అంతే కాదు రాజకీయ వ్యూహ చాతుర్యం ఉంది. దాంతో పాటు ఆయన మాటకు మాట ఇచ్చే వైఖరి, ఆయన సమయ స్పూర్తి ఇవన్నీ కూడా క్రెడిట్ గానే ఉంటున్నాయి. పలు సంచలన స్టేట్మెంట్స్ కూడా రేవంత్ రెడ్డి ఇస్తూ మీడియాలో ఎపుడూ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటున్నారు.
అంతే కాదు మీడియాలో తన స్పేస్ ఏపుడూ తగ్గకుండా చూసుకుంటూ ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయనను మరింతగా పెంచేలా రెండు ప్రధాన పార్టీలు ఆయనను టార్గెట్ చేయడం వల్ల కూడా నేషనల్ వైడ్ గా ఆయన పేరు మారుమోగుతోంది.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఎక్కడా ఆయనను అసలు విడిచి పెట్టడం లేదు. ఆయననే టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీకి చెందిన అగ్ర నేతలు మోడీ అమిత్ షా వంటి వారు రేవంత్ రెడ్డి మీద బాణాలు ఎక్కు పెడుతున్నారు. అదే టైం లో రేవంత్ రెడ్డి కూడా సమయస్పూర్తితో వాటిని తిప్పి కొడుతున్నారు.
ఇక బీజేపీకి సౌత్ లో తెలంగాణా మీద చూపు ఉంది. దంతో బీజేపీ వర్సెస్ రేవంత్ రెడ్డి గా కూడా జాతీయ స్థాయిలో ప్రతీ విషయం హైలెట్ అవుతోంది. ఇక సౌత్ ఇండియాలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందులో తెలంగాణా వచ్చిన తరువాత కాంగ్రెస్ కి అధికారం తెచ్చి సీఎం అయిన రేవంత్ రెడ్డి మీద ఇండియా కూటమి ఫోకస్ కూడా ఉంది.
ఇక కేసీఆర్ వంటి బాహుబలిని మాజీ సీఎం చేయడం చిన్న విషయం కాదు. జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలగాలని కేసీఆర్ కన్న కలలు అలా నీరుగారిపోయాయి. దాంతో కేసీఅర్ మీద అటెన్షన్ తో ఉన్న వారంతా ఆయన ప్రత్యర్ధిగా రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఇపుడు జాతీయ స్థాయిలో పాపులర్ అయిపోయారు. దేశంలో పాపులర్ పీపుల్ ఎవరు అన్న లేటెస్ట్ లిస్ట్ తీస్తే అందులో రేవంత్ రెడ్డికి 36వ స్థానం దక్కింది. అదే ఏపీ సీఎం జగన్ కి 52వ స్థానం దక్కింది. చాలా మంది ప్రముఖులు యాభై స్థానం పై దాటే ఉండడం విశేషం.
మరి రేవంత్ రెడ్డికి ఇది ఎలా సాధ్యమైంది ఆయన నంబర్ ఎందుకు ఇంత ముందుకు వచ్చింది అన్నది ఆలోచిస్తే కనుక ఆయన ఢీ కొడుతోంది మామూలు వ్యక్తులతో వ్యవస్థలతో కాదు అని అర్ధం అవుతోంది. రేవంత్ రెడ్డి బిగ్ టాస్క్ ని ఫేస్ చేస్తూ అందులో ఆయన ఎప్పటికపుడు సక్సెస్ అవుతున్నారు. మోడీకి అమిత్ షాకు మింగుడుపడని విధంగా తెలంగాణా రాజకీయం ఉంది. అలా చేయడంలో కాంగ్రెస్ సీఎం గా రేవంత్ రెడ్డి కీలకంగా ఉన్నారు.
దాంతో రేవంత్ రెడ్డి ఈ రోజు పాపులర్ అయ్యారు ఆయన పేరు నేషనల్ వైడ్ మారుమోగుతోంది అని అంటున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి మీద ఎప్పటికపుడు విమర్శలు చేస్తూ ఆయనని మరింతగా పాపులర్ చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ తమ వంతు పాత్ర విజయవంతంగా పోషిస్తున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది.