'సోషల్ మీడియా కంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా డేంజర్!'... ఆర్జీవీ వ్యాఖ్యలు!

సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఏపీలో నమోదైన కేసుల విషయంలో ఆర్జీవీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Update: 2024-12-02 12:35 GMT

సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఏపీలో నమోదైన కేసుల విషయంలో ఆర్జీవీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. మద్యంతర ఉత్తర్యులు ఇచ్చిన కోర్టు.. సోమవారం వరకూ ఆర్జీవీని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వర్మ ప్రెస్ మీట్ పెట్టారు.

అవును... తనను అరెస్ట్ చేయొద్దంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్య్వులు ఇచ్చిన వేళ.. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా నవంబర్ 25 నుంచి తనపై మీడియా సినిమా తీయడం మొదలుపెట్టిందని చెబుతూ.. అప్పటి నుంచి జరిగిన అన్ని విషయాలనూ వివరించారు!

ప్రధానంగా తనను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు పోలీసులు తనతో కానీ, తన సహచరులతో కానీ, మీడియాతో కానీ ఎక్కడా చెప్పినట్లు తాను వినలేదని.. తాను కూడా తన ఆఫీసులోనే ఉన్నానని.. ఇలా ఈ విషయంపై అటు పోలీసులకు, ఇటు తనకూ ఫుల్ క్లారిటీ ఉన్నప్పటికీ మీడియా మాత్రం మధ్యలో ఎంటరై ఓ సినిమా తీసేసిందని చెప్పుకొచ్చారు.

ఇక అసలు తాను సోషల్ మీడియా వేదికగా ఒక సంవత్సర కాలంలో ఎన్ని వేల పోస్టులో పెట్టి ఉంటానో తనకు గుర్తు కూడా ఉండదన్ని చెప్పిన ఆర్జీవీ.. అయితే సంవత్సరం తర్వాత ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టారాని.. ఏడాది తర్వత నలుగురైదుగురు ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో కేసులు పెట్టండపై తనకు సందేహాలు వచ్చాయని తెలిపారు.

అప్పుడు తనకు నోటీసులు పంపితే... తాను బిజీగా ఉన్నానని చెప్పానని.. తర్వాత నోటీసులు పంపితే ఇంకా బిజీగా ఉన్నానని చెప్పా.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వీడియో కాల్ లో విచారణకు హాజరవుతానని మెసెజ్ పెట్టిన 10 నిమిషాలకు పోలీసులు వచ్చారని.. ఇప్పటి వరకూ ఈ కేసు గురించి పోలీసులు ఏమీ మాట్లాడలేదు కానీ మీడియా మాట్లాడుతుందని అన్నారు.

తాను దాక్కొన్నానని.. పారిపోయానని.. మంచం కింద ఉన్నానని.. కేరళలో ఉన్నయని.. కోయంబత్తురూలో ఉన్నానని.. తన కోసం పోలీసులు ఆరు బృందాలుగా, రెండు రాష్ట్రాల్లో, మూడు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు జరగకున్నా జరిగింది అంటూ మీడియా చూపించిందని.. సోషల్ మీడియా కంటే మెయిన్ స్ట్రీం మీడియా డేంజర్ అయ్యిందని వర్మ కామెంట్స్ చేశారు.

Full View
Tags:    

Similar News