రిపోర్టు: తెలుగోళ్లలో కుబేరుడు ఎవరంటే? టాప్ 20లో ఎవరెవరంటే?

మంగళవారం విడుదలైన హురున్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 105 మంది చోటు దక్కించుకున్నారు

Update: 2023-10-11 04:30 GMT

మంగళవారం విడుదలైన హురున్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 105 మంది చోటు దక్కించుకున్నారు. టాప్ 10లో ఒక్కరు కూడా తెలుగు వారు లేకపోవటం గమనార్హం. మొత్తం 105 మందికి నివేదికలో చోటు లభించగా అందులో ఐదుగురు మాత్రమే మహిళలు. జాబితాలో చోటు దక్కించుకున్న మొత్తం 105 మంది తెలుగువారి సంపదను కలిపితే రూ.5.25 లక్షల కోట్లు మాత్రమే.


జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ సంపదలో 105 మంది తెలుగు వారి సంపద 60 శాతమే కావటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు పారిశ్రామికవేత్తల సంపద 33 శాతం పెరగ్గా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం12 మంది బిలియనీర్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. తెలుగువారిలో అత్యంత సంపన్నుడిగా దివీస్ మురళి రూ.55,700 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మేఘా ఇంజినీరింగ్ కు చెందిన పిచ్చిరెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న సంపన్నుల్లో 83 శాతం మంది హైదరాబాద్ లో ఉండేందుకు ఇష్టపడుతున్నారని నివేదిక పేర్కొంది. 105 మందిలో 87 మంది హైదరాబాద్ కు చెందిన వారే కావటం గమనార్హం. తాజా నివేదికలో కొత్తగా 33 మంది చేరటం విశేషం. వీరి సంపద విలువ రూ.76వేల కోట్లుగా పేర్కొన్నారు. జాబితాలో అత్యంత సంపద కలిగిన మహిళగా మహిమా దాట్ల నిలిచారు. ఆమె సంపద విలువ రూ.5700 కోట్లు. మొత్తం జాబితాలో చోటు దక్కించుకున్న 1105 మంది తెలుగు వారిలో 33 మంది ఫార్మా రంగానికి చెందిన వారే.

టాప్ 20లో తొలిసారి చోటు దక్కించుకున్న వారిని చూస్తే..

- యశోదా హెల్త్ కేర్ సర్వీసెస్ కు చెందిన మనోజ్ నంబూరు.. ప్రవీణ్ కుమార్ తో పాటు.. జి. రవీంద్రరావులు ఉన్నారు. వీరి సంపద విలువ రూ.5500 కోట్లు.

- షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు చెందిన ఎన్. విశ్వేశ్వర రెడ్డి ఫ్యామిలీ రూ.4600కోట్లు

- పవర్ మెక్ ప్రాజెక్ట్స్ కు చెందిన సజ్జ కిశోర్ బాబు ఆయన ఫ్యామిలీ సంపద రూ.4300 కోట్లు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన టాప్ 10 సంపన్నుల్లో ఎవరెవరు ఉన్నారంటే..

ర్యాంక్ పేరు సంస్థ పేరు సంపద (రూ.కోట్లల్లో)

01 మురళీ దివి&ఫ్యామిలీ దివీస్ లేబొరేటరీస్ 55,700

02. పి. పిచ్చి రెడ్డి మేఘా ఇంజినీరింగ్ 37,300

03. పీవీ క్రిష్ణారెడ్డి మేఘా ఇంజినీరింగ్ 35,800

04. బి. పార్థసారధి రెడ్డి&ఫ్యామిలీ హెటెరో ల్యాబ్స్ 21,900

05. రామేశ్వర్ రావు జూపల్లి&ఫ్యామిలీ మైహోం 17,500

06. జి.అమరేందర్ రెడ్డి&ఫ్యామిలీ జీఎఆర్ 15,500

07. కె.సతీశ్ రెడ్డి&ఫ్యామిలీ డాక్టర్ రెడ్డీస్ 15,200

08. ఎం. సత్యనారాయణరెడ్డి&ఫ్యామిలీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ 11,700

09. జీవీ ప్రసాద్&ఫ్యామిలీ డాక్టర్ రెడ్డీస్ 10,900

10. వెంకటేశ్వర్లు జాస్తి&ఫ్యామిలీ సువెన్ ఫార్మా 9,700

టాప్ 20 జాబితాలో మిగిలిన వారిని చూస్తే.. రామ్ కీ గ్రూప్ కు చెందిన అయోధ్య రామిరెడ్డి, నాట్కో ఫార్మాకు చెందిన వీసీ నన్నపనేని.. అలయన్స్ ఇన్ ఫ్రాకు చెందిన మనోజ్ నంబూరు, అరాజెన్ లైఫ్ సైన్సెస్ కు చెందిన జీవీ సంజయ్ రెడ్డి & ఫ్యామిలీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్ కు చెందిన జీఎస్ రాజు & ఫ్యామిలీ, అపర్ణ కన్ స్ట్రక్ష్న్ కు చెందిన ఎస్ సుబ్రమణ్యం రెడ్డి, గోల్డ్ మెడల్ ఎలక్ట్రికల్స్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ఓత్మాల్ జైన్, భారత్ బయోటెక్ కు చెందిన క్రిష్ణ ఎల్ల & ఫ్యామిలీ, అపర్ణ కన్ స్ట్రక్షన్ కు చెందిన సి. వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు.

Tags:    

Similar News