దారుణం... బైక్ రైడ్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసినందుకు...!!
ఈ క్రమంలోనే ఓ మహిళా డాక్టర్ కూడా బైక్ రైడ్ బుక్ చేసుకున్నారు. రావడానికి ఆలస్యం అవుతుందని క్యాన్సిల్ చేశారు. దీంతో... ఆమెకు నరకం చూపించాడో వ్యక్తి!
కొన్ని సందర్భాల్లో సొంత వాహనం కంటే క్యాబ్ లు బుక్ చేసుకోవడమే కంఫర్ట్ అని భావిస్తుంటారు చాలా మంది! ఇదే సమయంలో ప్రతీ చిన్న ప్రయాణానికీ కారు తీయడమో, కారు బుక్ చేసుకోవడమో చేసే కంటే బైక్ బుక్ చేసుకోవడం సులభమని, ట్రాఫిక్ లో కూడా వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని భావిస్తుంటారు.
అది కూడా తక్కువ ఖర్చుతోనే వీలైనంత తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని భావిస్తుంటారు. పట్టణాల్లో ఇప్పుడు చాలా మంది ఇవే ఫాలో అవుతున్నారని అంటున్నారు! ఈ క్రమంలోనే ఓ మహిళా డాక్టర్ కూడా బైక్ రైడ్ బుక్ చేసుకున్నారు. రావడానికి ఆలస్యం అవుతుందని క్యాన్సిల్ చేశారు. దీంతో... ఆమెకు నరకం చూపించాడో వ్యక్తి!
అవును... బైక్ రైడ్ బుకింగ్ చేసుకుని.. అది రావడానికి ఆలస్యం అవుతుందనే కారణంతో ఆ బుక్కింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నందుకు ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇందులో భాగంగా.. బాధితురాలికి సుమారు 17సార్లు ఫోన్ కాల్ చేయడంతోపాటు అసభ్య వీడియోలు పంపిస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాళ్లోకి వెళ్తే... కోల్ కతా లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఓ మహిళ. ఈ క్రమంలో శనివారం రాత్రి బైక్ పై ఇంటికి వెళ్లేందుకు యాప్ లో ఓ రైడ్ బుకింగ్ చేసుకున్నారు. అయితే.. బైక్ రావడం ఆలస్యం అవుతుండటమో ఆ రైడ్ ను ఆమె క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో... సదరు బైక్ రైడర్ పనికిమాలిన పనికి పూనుకున్నాడు!
ఇందులో భాగంగా... ఆమెకు 17సార్లు ఫోన్ చేయడంతో పాటు ఆమె వాట్సప్ నంబర్ కు అశ్లీల వీడియోలు పంపడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో... భయాందోళనకు గురైన ఆమె.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశరు. దీంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.