ఇసుక‌లో పిచుక గూళ్లు అంత ఇష్ట‌మా బాసూ!

ఇసుక క‌నిపిస్తే చిన్న పిల్ల‌ల‌కు ఎక్క‌డ‌లేని ఆనందం వ‌చ్చేస్తుంది. ఎంచ‌క్కా ఇసుక‌లో ఆట‌కు ఆస‌క్తి చూపిస్తారు. త‌ల్లిదండ్రుల‌తో బీచ్ కి వె ళ్తే పిల్ల‌లు ఇసుక‌లో ఎలా ఎంజాయ్ చేస్తారో తెలిసిందే.

Update: 2024-12-01 18:30 GMT

ఇసుక క‌నిపిస్తే చిన్న పిల్ల‌ల‌కు ఎక్క‌డ‌లేని ఆనందం వ‌చ్చేస్తుంది. ఎంచ‌క్కా ఇసుక‌లో ఆట‌కు ఆస‌క్తి చూపిస్తారు. త‌ల్లిదండ్రుల‌తో బీచ్ కి వె ళ్తే పిల్ల‌లు ఇసుక‌లో ఎలా ఎంజాయ్ చేస్తారో తెలిసిందే. ఇసుక‌తో ర‌క‌ర‌కాల ఆట‌లు ఆడుతుంటారు. ఆ స‌మ‌యంలో పెద్ద‌వాళ్లు సైతం పిల్ల‌లు గా మారిపోతారు. ఒక్కసారిగా చిన్న నాటి జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోతారు. హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ కూడా ఇసుక చూస్తే ఇప్ప‌టికీ చిన్న పిల్లాడినే అంటున్నాడు.

స‌ముద్ర తీరంలో గ‌డ‌ప‌డం అంటే ఎంతో ఇష్టం అంటున్నాడు. స‌మ‌యం తెలియ‌కుండా టైంపాస్ చేయ‌మంటే బీచ్ కెళ్లి ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ ఉండిపోతానంటున్నాడు. స‌ముద్రం తీరం వెంబ‌ని ఉన్న ఇసుక‌లో పిచుక గూళ్లు క‌ట్ట‌డం అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. అలాగే ఇసుక‌తో గుడులు కూడా ఎంతో అందంగా నిర్మిస్తా నంటున్నాడు. ఈ అల‌వాటు చిన్న‌ప్పుడే వ‌చ్చింద‌న్నాడు. వైజాగ్ లో ఉన్న‌ప్పుడు ఆర్కే బీచ్ లో ఆడుకోవ‌డం ఇప్ప‌టికీ గుర్తింది అంటున్నాడు.

అటుపై ముంబై కి కుటుంబంతో వెళ్లిన త‌ర్వాత అక్క‌డ బీచ్ స‌ర‌దాల్ని గుర్తు చేసుకున్నాడు. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన‌ప్పుడు స‌మ‌యం దొరికితే బీచ్ అందాల్ని చూడ‌టానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాడుట‌. బీచ్ ని ఆస్వాదించ డానికైతే స్నేహితులు అవ‌స‌రం లేద‌ని..ఒక్క‌డినే ఉన్నా వెళ్లిపోతానన్నాడు. ఇంకా చెప్పాలంటే బీచ్ కి సింగిల్ గా వెళ్ల‌డం అంటే ఇష్ట‌మ‌ట‌. స్నేహితుల‌తో వెళ్తే కాల‌యాప‌న త‌ప్ప‌! తాను అనుకున్న‌ది చేయ‌లేన‌న‌న్నాడు.

సింగిల్ గా వెళ్తే ఆ స‌మ‌స్య ఉండ‌ద‌న్నాడు. అలా బీచ్ తో హిట్ మ్యాన్ బాండింగ్ ముడిప‌డి ఉంది. బీచ్ ఇసుక‌తో ఎన్నో ర‌కాల క‌ళ‌ల‌కు ఆస్కారం ఉంది. పూరీ బీచ్లో ఓ క‌ళాకారుడు ప్ర‌త్యేకంగా ర‌క‌ర‌కాల టెంపుల్స్ ఇసుక‌తోనే ఎంతో అందంగా నిర్మిస్తాడు.

Tags:    

Similar News