చంద్రబాబు ప్రాణహాని... రోజా సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. జైల్లో ఉంచడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు.

Update: 2023-09-11 11:09 GMT

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి 14 రోజులు డిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ఆధివారం అర్ధరాత్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విషయంపై బాబు తరుపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు.

హౌస్‌ అరెస్ట్‌ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ పై వాదించేందుకు విజయవాడ కోర్టుకు వచ్చిన ఆయన తరుపు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. జైల్లో ఉంచడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు.

అవును... చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ఆయన తరుపు న్యాయవాది సిద్ధర్థ్ లూథ్రా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఎవరినైనా చంపేస్తాడు కానీ... ఆయనను చంపేవాళ్లు ఎవరూ పుట్టలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో ఇప్పటికే పొలిటికల్ గా ఎంతోమందిని పైకి పంపించిన చంద్రబాబు.. మరెంతోమందిని జైలుపాలు చేశారని, మరెంతో మందిని హింసించారని అన్నారు. ఇదే సమయంలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం కోసమే ఇంకా బ్రతికి ఉన్నాడని, అందుకే అలిపిరి బ్లాస్ట్ లో చంద్రబాబు బ్రతికారని రోజా వ్యాఖ్యానించారు.

అదేవిధంగా... చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం కోసమే నాడు అలిపిరి ఘటనలో తప్పించుకున్నారని, లేకుంటే అప్పుడే చనిపోయే వారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేక్రమంలో... చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని.. బోగస్‌ కంపెనీలతో దోచుకున్న కరప్షన్‌ కింగ్‌ అని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయాడని రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జనసేన కాదు... చంద్రసేన:

ఇదే ఫ్లోలో చంద్రబాబు అనంతరం జనసేన అధినేతపైనా రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని చంద్రసేనగా మార్చేశారని ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తికి పవన్‌ మద్దతిస్తున్నారని.. ఆయన పవర్‌ స్టార్‌ కాదు. ప్యాకేజ్‌ స్టార్‌ అని మండిపడ్డారు.

గతంలో చంద్రబాబు అవినీతిపై మాట్లాడిన పవన్ నేడు ప్యాకేజీ కోసమే తిరిగి ఆయనకు మద్దతు ఇస్తున్నారని రోజా అన్నారు. ఇదే సమయంలో... ముద్రగడను చంద్రబాబు ఇబ్బందిపెట్టినప్పుడు ఏమయ్యారని ప్రశ్నించిన రోజా... చిరంజీవిని ఎయిర్‌ పోర్టులో అడ్డుకున్నప్పుడు రోడ్‌ పై ఎందుకు దొర్ల లేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News