జగన్ చెవిలో రఘురామ చెప్పిందిదే

జగన్ భుజంపై చేయి వేసి మరీ ఆయనతో రఘురామ మాట్లాడిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-07-22 08:43 GMT

మాజీ వైసీపీ నేత, ప్రస్తుత టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గత ఐదేళ్లుగా వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలను ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ఆర్ఆర్ అసెంబ్లీ స్పీకర్ గా జగన్ ను సభలో టీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే, ఆర్ఆర్ఆర్ స్పీకర్ కాకపోయినా తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్, రఘురామల మధ్య ఆసక్తికర దృశ్యం అసెంబ్లీలో ఆవిష్కృతమైంది. జగన్ భుజంపై చేయి వేసి మరీ ఆయనతో రఘురామ మాట్లాడిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

సభ ప్రారంభానికి ముందు జగన్ తో మాట్లాడేందుకు రఘురామ ఆయన దగ్గరకు వెళ్లారు. రోజూ అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పానని రఘురామ ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో అన్నారు. రోజు అసెంబ్లీకి వస్తానని మీరే చూస్తారని జగన్ అన్నారట. ప్రతిపక్షం లేకపోతే మజా ఉండదని, జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని, అప్పుడే మజా ఉంటుందని పయ్యావులను రఘురామ కోరారు. జగన్ ను ర్యాగింగ్ చేస్తానో మరేం చేస్తానో మీరే చూస్తారుగా అని రఘురామ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మీ షేక్ హ్యాండ్ కు జగన్ పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదని కొందరు ఎమ్మెల్యేలు అనగా అయినా సరే షేక్ హ్యాండ్ ఇవ్వడం తన ధర్మమని చెప్పారు. జగన్ పక్కన తనకు సీటు కేటాయిస్తే అన్ని విషయాలు ఆయనకు పూసగుచ్చినట్టు చెప్తానని వెల్లడించారు. అయితే, ఏపీలో శాంతిభద్రతల గురించి ఢిల్లీలో ధర్నా చేయడం, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ తనకు అంతుబట్టకుండా ఉందని రఘురామ అన్నారు.

వినుకొండలో మర్డర్ ను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరించి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదన్నారు. జగన్ కు ప్రజాభిమానం తగ్గలేదని ప్రూవ్ చేసుకునేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో దండాలు పెట్టించి మీడియాలో ప్రచారం చేసుకున్నారని రఘురామ ఆరోపించారు. ఏదేమైనా ఉప్పు నిప్పులాగా ఉండే జగన్, రఘురామల మధ్య సంభాషణ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News