‘సిట్టింగ్ ఆన్ క్యాష్’ చాలా కష్టం... సమీర్ అరోర కీలక వ్యాఖ్యలు!

ఆ స్థాయిలో మార్కెట్ లో క్షీణత కనిపిస్తే మాత్రమే పెద్ద్ద నగదు నిల్వను ఉంచాలనే బఫెట్ నిర్ణయం ఓ తెలివైన చర్యగా పరిగణించబడుతుందని సమీర్ అరోరా తెలిపారు.

Update: 2024-09-23 11:30 GMT

పెట్టుబడి పెట్టకుండా పెద్దమొత్తంలో నగదు చేతిలో లేదా సేవింగ్స్ ఖాతాలో కలిగి ఉండటం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రముఖ పెట్టుబడిదారుదు సమీర్ అరోరా తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఇలాంటి నిర్ణయం కారణంగా వారెన్ బఫెట్ స్వయంగా కోల్పోయిన బిలియన్ డాలర్ల ఉదాహరణతో దీన్ని వివరించారు.

అవును... అమెరికా మార్కెట్ లో ఉన్న తాజా పరిస్థితిని విస్మరించి అందులో పెట్టుబడి పెట్టనందుకు ఒమాహాకు చెందిన ఒరాకిల్ సుమారు 60 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసిందని సమీర్ అరోరా పేర్కొన్నారు. ఇప్పుడు బఫెట్ కు కనీసం బ్రెక్ ఈవెన్ అవ్వాలంటే మార్కెట్ 20% పడిపోవాలని అన్నారు.

ఆ స్థాయిలో మార్కెట్ లో క్షీణత కనిపిస్తే మాత్రమే పెద్ద్ద నగదు నిల్వను ఉంచాలనే బఫెట్ నిర్ణయం ఓ తెలివైన చర్యగా పరిగణించబడుతుందని సమీర్ అరోరా తెలిపారు. బఫెట్ ఈ వ్యూహం నుంచి నిజమైన విలువను పొందాలంటే మార్కెట్ సుమారు 30% తగ్గాల్సి ఉంటుందని.. తద్వారా అతడు గణనీయంగా తక్కువ ధరలకు షేర్లను కొనుగోలు చేయొచ్చని తెలిపారు.

ఈ సమయంలో ప్రధానంగా యూఎస్ మార్కెట్ లో కొనసాగుతున్న ర్యాలీని దృష్టిలో ఉంచుకుని, అటువంటి క్షీణత కోసం వేచి ఉండటం విలువైనదేనా అనే ప్రశ్నను అరోరా లేవనెత్తారు. అతని దృష్టిలో వృద్ధి సమయంలో ఎక్కువ నగదును కలిగి ఉండటం వల్ల మార్కెట్ లో భవిష్యత్తులో తగ్గుదల నుంచి పొందే దానికంటే ఎక్కువ ఖర్చవుతుందని అన్నారు.

బఫ్ఫెట్ తన అతిపెద్ద పెట్టుబడులలో కొన్నింటిలో వాటాలను విక్రయించిన తర్వాత అతని నగదు స్థానం పెరిగింది. ట్రెజరీ బాండ్ల వంటి సెఫ్ ఇన్వెస్ట్ మెంట్స్ ద్వారా రాబడిని ఆర్జిస్తున్నారని.. ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించాలనే నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకున్నప్పటికీ.. ఈ జాగ్రత్తవల్ల నష్టపోయారని అరోరా అభిప్రాయపడ్డారు.

సెప్టెంబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2024 వరకూ సుమారు 50శాతం లాభంతో యూఎస్ స్టాక్ మార్కెట్ గత రెండు సంవత్సరాలలో బాగా పెరిగిందని.. దీనికి విరుద్ధంగా ట్రెజరీల వంటి లో రిస్క్ ఆస్తులలో పెట్టుబడి పెట్టిన బఫ్ఫెట్ నగదు ఏడాదికి కేవలం 5% మాత్రమే సంపాదిస్తోందని అన్నారు.

ఇదే సమయంలో... ఒరాకిల్ ఆఫ్ ఒమాహా ఈ సమయంలో నగదు రూపంలో ఉన్న 150 బిలియన్ డాలర్ల పొటెన్షియల్ రాబడిలో సుమారు 40% కోల్పోయిందని సూచించారు హీలియోస్ ఫండ్ మేనేజర్ అండ్ ఫౌండర్ సమీర్ అరోరా!

Tags:    

Similar News