విద్యార్థులకు షాకిచ్చిన కేంద్రం ఇక ఆ రెండు తరగతులు పాస్ కావాల్సిందే..

దీంతో ఈ రెండు తరగతులు చదువుతున్న విద్యార్థులు ఇకపై తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.

Update: 2024-12-23 22:30 GMT

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. 5, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించింది. దీంతో ఈ రెండు తరగతులు చదువుతున్న విద్యార్థులు ఇకపై తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం 5, 8వ తరగతులకు నో డిటెన్షన్ విధానం అమలు చేస్తున్నారు. ఈ రెండు తరగతులు చదివే వారు పరీక్షలకు హాజరైతే పాస్ అయినట్లు లెక్కగట్టేవారు. కానీ, ఇప్పుడు కేంద్రం నిర్ణయం మార్చుకోవడంతో ఆయా తరగతులు చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా వార్షిక పరీక్షల్లో కనీస మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. పాస్ మార్కులు తెచ్చుకున్న వారికే పై తరగతులకు అనుమతిస్తారు. కనీస మార్కులు రాని వారిని మళ్లీ అదే తరగతిలో కొనసాగిస్తారు.

పరీక్షల్లో ఫెయిన్ వారి కోసం రెండు నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష రాయిస్తారు. ఆ సప్లిమెంటరీ పరీక్షలో పాస్ అయితే ఆ తర్వాతి తరగతికి ప్రమోట్ చేస్తారు. నో డిటెన్షన్ విధానం విద్యా హక్కు చట్టం ద్వారా అమలులోకి వచ్చింది. అయితే ఈ విధానం ప్రభుత్వం ఆధ్వర్యంలోని నడుస్తున్న మూడు వేల పాఠశాలలకు మాత్రమే వర్తించనుంది. ఇందులో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాసంస్థలు, సైనిక స్కూళ్లు ఉన్నాయి. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశారు. ఈ నిబంధన అమలు చేయడమనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి కేంద్రం వదిలేసింది. మరి తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.

Tags:    

Similar News