జగనన్న వదిలిన బాణం.. రివర్స్ అవుతోందే!!
అంతేకాదు.. ఆమె వస్తానంటే, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందని గిడుగు చెప్పారు. దీంతో ఇప్పుడు షర్మిల ఏపీలో ఎంట్రీపై రాజకీ య వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
`నేను జగనన్న వదిలిన బాణాన్ని`` అంటూ.. గతంలో ఏపీలో పాదయాత్ర చేసి వైసీపీకి ప్రాణం పోసిన.. వైఎస్సార్ ముద్దల తనయ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల.. ఇప్పుడు అదే జగనన్నపై రివర్స్‌లో వస్తోందా? ఏపీలో ఆమె ప్రవేశానికి రంగం రెడీ అవుతోందా? అంటే.. ఔననే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గిడుగు రుద్ర రాజు మాట్లాడుతూ.. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆమె ప్రచారం చేయొచ్చని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఆమె వస్తానంటే, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందని గిడుగు చెప్పారు. దీంతో ఇప్పుడు షర్మిల ఏపీలో ఎంట్రీపై రాజకీ య వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. అనూహ్యంగా పోటీకి దూరంగా ఉన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. కేసీఆర్‌ను ఓడించడమే ధ్యేయమని.. అందుకేకాంగ్రెస్‌కు మద్దతిస్తున్నానని చెప్పారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఆ తరహా ఆహ్వానాలు.. ఎక్కడా కనిపించలేదు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా ఆమెను ఆహ్వానించినట్టు ఎక్కడా వార్తలు రాలేదు.
ఇదిలావుంటే.. ఇప్పుడు ఏపీలోకి షర్మిల వచ్చినా.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి. పైగా సొంత అన్న జగన్ సర్కారునే ఆమె లక్ష్యంగా చేసుకుని మాటలు సంధించాలి. గత ఐదేళ్లుగా(మరో మూడు మాసాలతో) జగన్ పాలిస్తున్నారు. తరచుగా బీఆర్ ఎస్ నాయకులు అనేక విమర్శలు చేశారు. అయితే.. అప్పట్లో మౌనంగా ఉన్న షర్మిల.. కుటుంబ పరంగా మాత్రం విభేదిస్తూ వచ్చారు. తన గురించి వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడినా.. ఆమె ఘాటుగానే స్పందించారు.
``మీ పనిమీరు చూసుకోండి సజ్జలా!`` అంటూ.. సలహాదారు సజ్జలకు కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు షర్మిల ఏపీలోకి ఎంట్రీ ఇస్తే.. రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? సీఎం, తన అన్న జగన్‌ను ఎలా కార్నర్ చేస్తారు? అనేది చూడాలి. ప్రస్తుతం గిడుగు వ్యాఖ్యల తర్వాత.. షర్మిల రాజకీయ వ్యూహంపై మరోసారి చర్చ జరుగుతుండడం గమనార్హం.