జగన్ పై దాడి... షర్మిళ ట్వీట్ లో ఆ ఒక్కమాటా నెట్టింట వైరల్!

ఈ సమయంలో వైఎస్ షర్మిళ చేసిన ట్విట్టర్ లో స్పందించారు. ఇందులో భాగంగా... "ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం" అని రాసుకొచ్చారు! దీంతో... కీబోర్డులకు పని చెబుతున్నారు నెటిజన్లు!

Update: 2024-04-14 05:53 GMT

ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ "మేమంత సిద్ధం" అంటూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో శనివారం రాత్రి రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ సింగ్‌ నగర్‌ డాబా కొట్ల సెంటర్‌ కు చేరుకోగానే ఒక ఆగంతకుడు దాడి చేశాడు! జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువు విసరడంతో... ఆయన ఎడమ కంటి కనుబొమపై భాగాన బలమైన గాయమైంది.

 

దీంతో... బస్సుపై నుంచి దిగి లోపలకి వెళ్లారు జగన్‌. డాక్టర్‌ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం యధావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. ఇలా జగన్ పై ఆగంతకుడు దాడి చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది! దీంతో... వైసీపీ శ్రేణులు... ఈ వ్యవహారాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ.. విపక్షాలపై నిప్పులు చెరిగారు! ఈ సమయంలో షర్మిళ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును.. వైఎస్ జగన్ పై విజయవాడలో దాడి జరిగిన ఘటనపై ప్రధాని మోడీ నుంచి చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, మమత బెనర్జీ, కేటీఆర్ మొదలైన వారంతా ముక్తకంఠంతో ఖండించారు. ఈ సమయంలో వైఎస్ షర్మిళ చేసిన ట్విట్టర్ లో స్పందించారు. ఇందులో భాగంగా... "ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం" అని రాసుకొచ్చారు! దీంతో... కీబోర్డులకు పని చెబుతున్నారు నెటిజన్లు!

ఇందులో భాగంగా... ఒక మనిషి నడుస్తున్నప్పుడు కాలికి రాయి తగిలితే అది ప్రమాదవసాత్తు అనుకోవచ్చు కానీ... బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న వ్యక్తికి నేరుగా ఒక వస్తువు వచ్చి నుదిటిపై తగిలి, రక్తం కారి, కుట్లు పడినంతగా గాయం అయితే దాన్ని కూడా ప్రమాదవసాత్తు జరిగిందన్నట్లుగా స్పందించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు! ఈ ఒక్క సెంటెన్స్ లేకుండా ట్వీట్ చేస్తే అది వేరేగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

కాగా... వైఎస్ జగన్ పై దాడి జరిగిన అనంతరం ఆన్ లైన్ వేదికగా స్పందించిన షర్మిళ... "ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం" అని మొదలుపెట్టారు.

ఇదే క్రమంలో... "అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు. దీంతో... ప్రస్తుతం ఈ ట్వీట్ పై రకరకాల అభిప్రాయాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన భావానువాదాలు వైరల్ గా మారుతున్నాయి!

Tags:    

Similar News