పెళ్లికి ముందే ఆమెను వాడుకున్నారు.. పాకిస్థాన్ మాజీ ప్రధానిపై సంచలన కేసు
కానీ, ఇమ్రాన్-బుష్రాలు.. ప్రేమలో పడి.. పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నారని.. అది కూడా బుష్రా ఇంటికి నేరుగా వచ్చిన ఇమ్రాన్.. ఆమెను పెళ్లికి ముందే వాడుకున్నారని.. ఓ సాక్షి.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీంతో తాజాగా మరో కేసు నమోదైంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రముఖ క్రికెటర్, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌పై మరో సంచలన కేసు నమోదైంది. అది కూడా ఆయనపై నమోదైన అనేక కేసుల విచారణలో వెలుగు చూడడం గమనార్హం. బుష్రా అనే మహిళను ఇమ్రాన్ ఏడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. అప్పటికే ఆమెకు వివాహం అయింది. కానీ, ఇమ్రాన్-బుష్రాలు.. ప్రేమలో పడి.. పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నారని.. అది కూడా బుష్రా ఇంటికి నేరుగా వచ్చిన ఇమ్రాన్.. ఆమెను పెళ్లికి ముందే వాడుకున్నారని.. ఓ సాక్షి.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీంతో తాజాగా మరో కేసు నమోదైంది.
ఏం జరిగింది?
బుష్రా బీబీ, ఖవార్ ఫరీద్ భార్యా భర్తలు. అయితే.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ విడాకులకు అప్లయి చేశారు. ఈ కేసు పరిష్కారం కాలేదు. ఇంతలో ఇమ్రాన్‌తో బీబీకి పరిచయం ఏర్పడింది. ఇది పెళ్లికి కూడా దారి తీసింది. ఇది, ఇమ్రాన్ జీవితంలో ఏడో పెళ్లికాగా, బుష్రాకు మూడో వివాహం.అయితే.. బీబీ ఇంట్లో పనిచేసే అటెండర్.. మహమ్మద్ లతీఫ్ తాజాగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఇమ్రాన్, బుష్రా బీబీ పెళ్లి చేసుకోవడానికి ముందు వాడుకున్నారని కోర్టులో చెప్పాడు.
ఇమ్రాన్ తరచూ ఇంటికి వచ్చేవాడని, వారిద్దరూ ఒకే గదిలో గంటల తరబడి గడిపేవారని లతీఫ్ కోర్టులో చెప్పారని.. స్థానిక మీడియా తెలిపింది. ఇమ్రాన్, బుష్రా వివాహేతర సంబంధానికి తానే ప్రత్యక్ష సాక్షినని తెలిపారు. ఇస్లామాబాద్‌లోని సివిల్ జడ్జి ఖుదర్తుల్లా కోర్టులో లతీఫ్ ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చాడు. గదిలోకి వెళ్లిన వాళ్లిద్దరిపై(ఇమ్రాన్, బుష్రా బీబీ) ఓ కన్నేసి ఉంచమని తన యజమాని ఫరీద్ చెప్పేవారని, అయితే తాను గదిలోకి వెళ్లినప్పుడు వాళ్లు తనని తిట్టి పంపించేవారని తెలిపాడు.
వాళ్లిద్దరు గదిలో ఎలా గడిపేవారో కూడా తాను చూశానని, దాంతో ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్న విషయం బట్టబయలు అయ్యిందని తెలిపాడు. అయితే.. ఈ ఆరోపణల్ని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చాడు. తమ మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదని, నిఖా రోజున మాత్రమే తాను బుష్రా బీబీ ముఖం చూశానని పేర్కొన్నాడు. తన ఇమేజ్‌ని దెబ్బతీసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు. అసలు పెళ్లికి ముందు తామెప్పుడూ కలుసుకోలేదని పేర్కొన్నారు. అయితే.. దీనిపై కేసు నమోదు చేయమని ఆదేశించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.