వణికించేసిన విమానం వీడియో... సింగపూర్‌ విమానంలో భయానక దృశ్యాలు!

ఇటీవల ఫ్లైట్స్ లో జరుగుతున్న రకరకాల విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Update: 2024-05-22 07:26 GMT

ఇటీవల ఫ్లైట్స్ లో జరుగుతున్న రకరకాల విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా లండన్ టు సింగపూర్ విమానానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకుపోతుండగా.. ఒక్కసారిగా కుదుపు మొదలైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సమయంలో దర్శనమిచ్చిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారింది.

అవును... లండన్‌ నుంచి సింగపూర్‌ కు బయల్దేరిన విమానంలో జరిగిన అలజడి ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ విమానం బయలుదేరి సుమారు 11 గంటలైన తర్వాత మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరుకుంటుందనగా... మేఘాల మధ్యలో విమానంలో ఒక్కసారిగా కుదుపు సంభవించింది. లోపల ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. చుట్టూ అల్లకల్లోలం మొదలైంది.

ఇందులో భాగంగా... సీట్లలో ఉన్నవారిపై నుంచి వస్తువులు జారి పడటం మొదలైంది.. ఈ సమయంలో సీట్లలో ఉండాల్సిన వ్యక్తులు పైకి ఎగిరి పడుతున్నారు.. ఈ నేపథ్యంలో విమానం బ్యాంకాక్‌ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ సమయంలో విమానమంతా చిందర వందర కాగా... సీట్లకు రక్తపు మరకలు అయిన పరిస్థితి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

ఈ ఘటన మే 20న జరిగింది. సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానం మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో కలిపి లండన్‌ నుంచి సింగపూర్‌ కు బయల్దేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. ఆ సమయంలో 37 వేల అడుగుల ఎత్తులో విమానం ఉండగా... కేవలం ఐదే ఐదు నిమిషాల్లో 31 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 6 వేల అడుగులు కిందకు దిగింది.

Tags:    

Similar News