బట్టలన్నీ విప్పేసి పోలీస్ స్టేషన్ ముందు భరతనాట్యం

మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది. అది వేయి రకాలుగా ఉంటుందట. ఈనేపథ్యంలో తాగుబోతులు మరింత విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.

Update: 2024-03-15 06:07 GMT
బట్టలన్నీ విప్పేసి పోలీస్ స్టేషన్ ముందు భరతనాట్యం
  • whatsapp icon

మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది. అది వేయి రకాలుగా ఉంటుందట. ఈనేపథ్యంలో తాగుబోతులు మరింత విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఏం చేస్తారో వారి తెలియదు. లోపల రంగడు పడితే రింగులా తిరుగుతుంటారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో వారికే తెలియదు. మత్తు దిగాక జరిగిందంతా మరిచిపోవడం కామనే. ఈ క్రమంలో ఓ తాగుబోతు చేసిన నిర్వాకం అందరిని ఆందోళనకు గురిచేసింది. బట్టల్లేకుండా అతడు చేసిన హంగామా భయం కలిగించింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట జైపాల్ (35) అనే తాగుబోతు అర్థరాత్రి చేసిన హంగామా అలజడి కలిగించింది. పీకల దాకా మద్యం తాగడంతో ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగాడు. అందరిని నానా బూతులు తిడుతూ రెండున్నర గంటల పాటు బెదరగొట్టాడు. పోలీసులు ఎంత సముదాయించినా వినకుండా గలాటా చేశాడు.

చివరకు అతడి దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని బంధువులకు సమాచారం అందించడంతో వారు వచ్చే వరకు కూడా అతడి వినలేదు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. తాగుబోతు వీరంగంతో అందరు ఆశ్చర్యపోయారు. అర్థరాత్రి పూట అంకమ్మ శివాలన్నట్లు తాగుబోతు చేసిన తతంగం ఊరంతా చూస్తూ ఉండిపోయారు.

మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగడంతో ఇలా తాగుబోతులు రెచ్చిపోతున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుటే తాగుబోతు నగ్నంగా తిరగడం సంచలనం కలిగించింది. సమాజానికి భంగం కలిగేలా ఇలాంటి చర్యలు ప్రజలను సిగ్గుబాటుకు గురి చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనల వల్ల పరువు పోతుందని వాపోతున్నారు. పోలీసుల ముందే ఒళ్లు తెలియకుండా విన్యాసాలు చేయడం గమనార్హం.

పోలీస్ స్టేషన్ ముందు బట్టలు లేకుండా భరతనాట్యం చేయడంతో నోరెళ్లబెట్టారు. గంటల పాటు అతడు డ్యాన్సు చేయడం అక్కడున్న వారికి ఇబ్బందులకు గురిచేసింది. బూతులు తిడుతూ పడుతూ లేస్తూ అతడు చేసిన విన్యాసాలతో పోలీసులకు కూడా చెమటలు పట్టాయి. దీనిపై పట్టణంలో చర్చలు కూడా జరుగుతున్నాయి. తాగుబోతుల తీరుతో ప్రజలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు.

Tags:    

Similar News