భారీ కుట్ర బద్ధలు? 6గురుఅలీగఢ్ వర్సిటీ విద్యార్థులు అరెస్టు
దేశ వ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్న వేళ.. షాకింగ్ ఉదంతం ఒకటి వెల్లడైంది.
దేశ వ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్న వేళ.. షాకింగ్ ఉదంతం ఒకటి వెల్లడైంది. ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఇస్లామిక్ స్టేట్ (పొట్టిగా ఐసిస్) ఉగ్రవాద సంస్థ తరఫున పని చేస్తున్నారన్న ఆరోపణలతో ఆరుగురు అలీగఢ్ విద్యార్థుల్ని యాంటీ స్క్వాడ్ అధికారులు అరెస్టు చేశారు. నిందితులందరికీ అలీగఢ్ వర్సిటీ విద్యార్థుల సంఘమైన స్టూడెంట్స్ ఆఫ్ అలీగఢ్ వర్సిటీతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు.
ఈ ఆరుగురి అరెస్టు వర్సిటీలో ప్రకంపనల్ని క్రియేట్ చేయటంతోపాటు.. షాకింగ్ గా మారింది. నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం వీరు తరచూ సమావేశాల్ని నిర్వహిస్తుంటారని గుర్తించారు. ఐసిస్ లోకి కొత్తవారిని చేర్చుకుంటున్నట్లుగా ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్వ్కాడ్ విభాగం వెల్లడించింది. దేశంలో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
అరెస్టు అయిన అలీగఢ్ వర్సిటీ విద్యార్థులు రకీమ్ ఇనామ్.. నవీద్ సిద్దిఖి.. మహ్మద్ నొమాన్.. మహ్మద్ నజీమ్ అనే నలుగురిని గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నలుగురిని యూపీలోని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేయటం గమనార్హం. ఇప్పటికే ఈ విద్యార్థి సంఘం కార్యకలాపాల మీద కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఒక కన్నేసి ఉంచారు. వీరి యాక్టివిటీస్ మీద ట్రాక్ చేస్తున్నారు. తాజాగా బద్ధలైన ఉగ్ర పాపాల పుట్ట మరో విధ్వంసానికి అడ్డు కట్ట పడేలా చేసిందని చెప్పక తప్పదు