మహిళ మెదడులో బ్రతికున్న ఏలికపాము... ఎంత పొడవంటే...!

అవును... మొదట్లో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన ఒక మహిళ... వాటితో పాటు మతిమరుపును కూడా ఎదుర్కొంది

Update: 2023-08-30 06:21 GMT

ఓ మహిళ గత కొన్ని రోజులుగా కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంది. అయితే... ఇలాంటి ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణమే కదా అని భావించిన ఆమె లైట్ తీసుకుంది.. అందుబాటులో ఉన్న మందులు వేసుకుంది. అయినా కూడా తగ్గకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అవును... మొదట్లో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన ఒక మహిళ... వాటితో పాటు మతిమరుపును కూడా ఎదుర్కొంది. దీంతో ఆందోళన చెందిన ఆమె... వైద్యులను సంప్రదించింది. ఈ సమయంలో ఎన్ని పరీక్షలు చేసినా అన్నీ నార్మల్ గా వస్తుండటంతో చివరిగా ఎం.ఆర్‌.ఐ స్కాన్‌ చేశారు. ఈ సమయంలో ఆమె మెదడులో ఉన్న జీవిని చూసి షాకయ్యారు.

వివరాళ్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ కు చెందిన ఓ మహిళ(64) కడుపు నొప్పి, దగ్గు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో కాన్‌ బెర్రా ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి తీవ్రమవుతుండటంతో మెదడులో ఏమైనా సమస్య ఉందేమో అని ఎం.ఆర్.ఐ. స్కాన్ చేశారు వైద్యులు. ఆ సమయంలో ఆమె మెదడులో పాములాంటి ఆకారాన్ని చూశారు.

అనంతరం ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు... ఆమె మెదడు నుంచి బ్రతికున్న ఓ ఏలిక పామును బయటకు తీశారు. అది సుమారు ఎనిమిది సెంటీ మీటర్ల పొడవు ఉండటం గమనార్హం. ఈ విషయంపై స్పందించిన వైద్యులు... ఇలాంటి పరాన్న జీవులు సాధారణంగా కొండచిలువల్లో కనిపిస్తుందని అన్నారు. ఇదే సమయంలో ఇవి మనిషికి సోకడం ప్రపంచంలో దాదాపు ఇదే మొదటిసారని తెలిపారు.

అనంతరం ఈ విషయంపై స్పందించిన న్యూరోసర్జన్‌ డా.హరిప్రియా బండి... ఊహించని ఈ విషయంతో అంతా షాక్‌ తిన్నామని తెలిపారు. ఆ పరాన్న జీవిని ల్యాబ్‌ లో పరీక్షించారని అన్నారు. ఆ సమయంలో అది కార్పెట్ కొండచిలువల్లో కనిపించే ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ ఏలిక పాముగా తేలిందని వెల్లడించారు.

ఇదే సమయంలో ఈ విషయంపై మరింత స్పందించిన వైద్యులు... ఈ కేసు మానవులకు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల ప్రమాదాల గురించి తెలియజేసిందని తెలిపారు. ఈ సందర్భంగా... ప్రపంచవ్యాప్తంగా ఉ‍ద్భవిస్తున్న అంటువ్యాధులలో సుమారు 75 శాతం జూనోటిక్‌ (జంతువుల నుంచి సంక్రమించే) వ్యాదులే అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News