నారా లోకేష్ కి కొంత ఊరట మాత్రమే....!

టీడీపీ నేత నారా లోకేష్ కి కొంత ఊరట మాత్రమే లభించింది. ఆయనకు తండ్రి చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం లో పాత్ర ఉందని సీఐడీ కేసు నమోదు చేసింది.

Update: 2023-09-29 16:56 GMT

టీడీపీ నేత నారా లోకేష్ కి కొంత ఊరట మాత్రమే లభించింది. ఆయనకు తండ్రి చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం లో పాత్ర ఉందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఇక రేపో నేడో ఆయనను కూడా అరెస్ట్ చేసి జైలులో పెడతారు అని అనుకుంటున్న వేళ ముందస్తు బెయిల్ కోసం ఆయన హై కోర్టుకు వెళ్లారు. దీనితో పాటు ఫైబర్ నెట్ స్కాం విషయంలో ముందస్తు బెయిల్ కోరారు.

ఇక ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం లో లోకేష్ పేరుని సీఐడీ చేర్చింది. దాంతో ఈ కేసులో అరెస్ట్ లేకుండా ఉండేదును ముందస్తు బెయిల్ కోరారు. అయితే ఈ మూడు కేసులలో హైకోర్టు లోకేష్ కి స్కిల్ డెవలప్మెంట్ స్కాం విషయంలో మాత్రమే ముందస్తు బెయిల్ ఇచ్చింది. అది కూడా అక్టోబర్ 4వ తేదీ వరకూ మాత్రమే ఇచ్చింది. అప్పటివరకూ చినబాబు ని అరెస్ట్ చేయవద్దని సీఐడీ అధికారులకు సూచించింది.

ఇక ఫైబర్ నెట్ కేసు విషయంలో చూస్తే ముందస్తు బెయిల్ విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో లోకేష్ ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదని అంటున్నారు. సీఐడీ అధికారులు ఈ కేసులో సి ఆర్ పి సి సెక్షన్ 41 ఏ ప్రకారం నోటీసులు జారీ చేసిన నేపధ్యంలో ఆయన విచారణకు ఎపుడు పిలిస్తే అపుడు హాజరు కావాల్సి ఉంటుంది.

దాంతో లోకేష్ ఉన్న చోటకు అంటే ఢిల్లీకి సీఐడీ అధికారులు వెళ్ళి మరీ నోటీసులు అందచేసే పనిలో ఉన్నారు. ఎనిమిది మంది సీఐడీ అధికారులు ఈ మేరకు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఇలా కనుక చూస్తే లోకేష్ మీద మూడు కేసులలో ముందస్తు బెయిల్ పెట్టుకుంటే కొంత వరకూ ఊరట దక్కింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే.

చంద్రబాబు విషయమే తీసుకుంటే ఆయన ఇన్నర్ రోడు అలైన్మెంట్ కేసుకు సంబంధించి హై కోర్టులో రెండు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరికి హై కోర్టు ఈ కేసుని అక్టోబర్ 3కి వాయిదా వేసింది. దాంతో చంద్రబాబుకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఊరట లభించలేదు.

ఏది ఏమైనా కూడా కేసుల మీద కేసులు దాని మీద పిటిషన్లు ఇలా చంద్రబాబు చినబాబు కోర్టుల మీద ఆశతో చూస్తున్నారు. అన్ని కేసుల మీద అక్టోబర్ 3 తరువాతనే కదలికలు ఏమైనా ఉండే చాన్స్ ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు జైలు జీవితం మరికొన్నాళ్ళ పాటు సాగనుంది. అలగే చినబాబు ఢిల్లీ ప్రవాసం కూడా ఇంకొన్నాళ్ళు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అంతవరకూ నో డెవలప్మెంట్స్ అన్నట్లుగానే సీన్ ఉంది.

Tags:    

Similar News