తెలంగాణ హోం శాఖ.. 'కామ్' శాఖే.. అడిగిందెంత? ఇచ్చిందెంత?
ఇప్పటికీ డ్రగ్స్ కేసుల్లో నిందితులను గుర్తించేందుకు మహారాష్ట్రలోని పుణే వంటి కీలక నగరాలకు శాంపిళ్లను పంపించాల్సి వస్తోంది.
అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో అంతే స్థాయిలో అనేక దుర్వ్యసనాలు.. కూడా అభివృద్ధి చెందుతు న్నాయి. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి సహా.. అనేక ఇతర ప్రమాదకర అలవాట్లకు నిలయంగా.. కీలకమైన జిల్లాలు ఎదుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు.. తమ మరింత జవసత్వాలు ఇవ్వాలని.. రాష్ట్ర హోం శాఖ ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపుతూనే ఉంది. ఇప్పటికీ డ్రగ్స్ కేసుల్లో నిందితులను గుర్తించేందుకు మహారాష్ట్రలోని పుణే వంటి కీలక నగరాలకు శాంపిళ్లను పంపించాల్సి వస్తోంది.
దీంతో కేసులు ఆలస్యమై.. నిందితులు దొడ్డి దారుల్లో తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోనే ఓ ల్యాబొరేటరీని కట్టించాలని కొన్నాళ్లుగా డిమాండ్ ఉంది. అదేవిదంగా సిబ్బందిని సుశిక్షితులను చేసేందుకు పక్కా పరికారాలు ఉండాలని.. వాటిని కూడా ఇవ్వాలని కోరింది. కానీ, గత బీఆర్ ఎస్ ప్రభు త్వం పట్టించుకోలేదు. ఇక, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా.. దారుణంగానే వ్యవహరించింది. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తమకు 30 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని అభ్యర్థించింది.
కానీ, ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.9,564 కోట్లు కేటాయించారు. పైగా అనేక మాటలు చెప్పడం గమనార్హం. మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరంగా మారిందని మంత్రి భట్టి చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల ను, ముఖ్యంగా విద్యార్థులను ఈ మహమ్మారి బారి నుంచి కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా మంటూనే.. డ్రగ్స్ రవాణా, వినియోగం చేస్తూ పట్టుబడితే వారిని ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని చెప్పారు. కానీ, చిత్రం ఏంటంటే.. చాలి నంత సిబ్బంది లేరని చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న వాదనను మంత్రి దాటవేశారు.
ఇదిలావుంటే, సైబర్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు చెప్పారే తప్ప.. నిధులు కేటాయించక పోవడం గమనార్హం. సైబర్ నేరాలకు కేంద్రాలు ఎక్కడో సుదూరంలో ఉన్న దేశాలు మారాయి.అక్కడకు వెళ్లి నేరస్తులను అదుపులోకి తీసుకునేందుకు నిధులు లేక.. ఇప్పటికి రాష్ట్ర సర్కారు దగ్గరే 12 కేసులు మూలుగుతున్నాయి. ఎలా చూసుకున్నా.. ప్రస్తుతం హోంశాఖకు ఇచ్చిన నిధులు కనీసం కూడా.. అవసరాలు కూడా తీర్చేలా లేక పోవడంపై ఆ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.