బాలయ్య మాన్షన్ హౌస్.. 8.15 PM అయింది..!
తాజాగా ఆయన తన మామగారైన బాలయ్య గురించి సరదాగా మాట్లాడిన ఒక విషయం అభిమానుల సోషల్ మీడియాల్లో వైరల్ గా మారుతోంది.
నటసింహా నందమూరి బాలకృష్ణ ఓవైపు కథానాయకుడిగా నటిస్తూనే, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తేదేపా గెలుపే ధ్యేయంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఆయన అల్లుడు శ్రీభరత్ కూడా ఎంపీగా పోటీబరిలో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శ్రీభరత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
తాజాగా ఆయన తన మామగారైన బాలయ్య గురించి సరదాగా మాట్లాడిన ఒక విషయం అభిమానుల సోషల్ మీడియాల్లో వైరల్ గా మారుతోంది. ఎఫ్.బిలో స్ట్రీమ్ అవుతున్న ఈ వీడియో క్లిప్ లో ఒక కాఫీ షాప్‌లో సంభాషణ. శ్రీభరత్ మాట్లాడుతూ... ''ఎప్పుడూ మావయ్యతో ఒక బ్యాగ్ ఉంటుంది.. హాట్ వాటర్ - వాటర్ బాటిల్ ఆయనతో ఉంటాయి.. అమెరికా వెళ్లినా ఆయన వెంట తెచ్చుకుంటారు. చాలా లాయల్టీ మావయ్య గారు..'' అని అన్నారు శ్రీభరత్.
అయితే బాలయ్యకు ప్రఖ్యాత బ్రాండ్ మాన్షన్ హౌస్ పై ఉండే మక్కువ గురించి ఆ ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. ''నిజంగా మాన్షన్ హౌస్ టైమ్ అయింది. సమయం 8.15 అయింది'' అంటూ ముచ్చటించుకోవడం వారి మధ్య సరదా పరిహాసంగా కనిపించింది. అలాగే బాలయ్య బాబుకు సెంటిమెంట్ ఎక్కువ. దాంతో పాటు హాట్ వాటర్‌ని మెయింటెయిన్ చేయడంతో పాటు ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణగా ఉంటారని వారి మాటలను బట్టి అర్థమైంది.
నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసారు. ఆయన గీతం విద్యాసంస్థల అధినేత. తన తాత గారి స్ఫూర్తితో శ్రీభరత్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేయాలనేది శ్రీభరత్ డ్రీమ్. పొలిటికల్ ఎంట్రీపై మామ బాలకృష్ణ, భార్య తేజస్విని ముందు తన ప్రతిపాదన పెట్టడమే గాక అనుకున్న విధంగా ఈసారి చంద్రబాబును ఒప్పించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.