బాలయ్య అల్లుడి ట్విస్ట్ తో ఆయన సీటు డైలామాలో...?

జనాలతో కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. దాంతో సౌత్ నుంచి శ్రీ భరత్ పోటీ ఖాయమని అంటున్నారు

Update: 2023-07-16 04:09 GMT

బాలయ్య చిన్నల్లుడు, గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ ఆశలు ఎంపీ సీటు నుంచి ఎమ్మెల్యే మీదకు మళ్ళిపోయాయని అంటున్నారు. విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేయాలని మనసా వాచా భరత్ కి ఉన్నా పొత్తులు ఉంటే అక్కడ చాలా పెద్ద కాంపిటేషన్ ఉంది అని అంటున్నారు. బీజేపీకి కచ్చితంగా ఆ సీటుని వదులుకోవాల్సిందే. దాంతో అంత ప్రయాస ఎందుకు అని శ్రీ భరత్ మూడు అసెంబ్లీ సీట్ల మీద కన్నేశారు అని అంటున్నారు.

అందులో మొదటిది తన గీతం విద్యా సంస్థలు ఉన్నా భీమిలీ నియోజకవర్గం అని అంటున్నారు. ఆ సీటు టీడీపీకి కంచుకోట. తనకు ఇస్తే గెలుచుకుని వస్తాను అని భరత్ అంటున్నారు. అక్కడ గ్రామీణ నేపధ్యం ఉంటుంది. దాంతో నాన్ లోకల్ కార్డుతో ప్రత్యర్ధి వైసీపీ రెచ్చగొడుతుంది అన్న భయం ఉంది. అదే సమయంలో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ కూడా నాన్ లోకలే కదా అనుకున్నా గంటా శ్రీనివాసరావు చివరి నిముషంలో ఈ సీటు నుంచి పోటీకి దిగుతారు అని అంటున్నారు. దాంతో పాటు జనసేనకు ఈ సీటు పోతుంది అన్న ప్రచారం ఉంది.

ఈ నేపధ్యంలో సేఫ్ జోన్ గా ఉంటుందని మరో రెండు అసెంబ్లీ సీట్లను లైన్ లో పెట్టారని అంటున్నారు. అందులో విశాఖ సౌత్ సీటు ఒకటి. ఇటీవల కాలంలో భరత్ ఎక్కువగా అక్కడ పర్యటిస్తున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు.

జనాలతో కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. దాంతో సౌత్ నుంచి శ్రీ భరత్ పోటీ ఖాయమని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా కొంత మాస్ అప్పీల్ నేపధ్యం ఉంది. దాంతో ఈ సీటుతో పాటు విశాఖ నార్త్ సీటు మీద శ్రీ భరత్ కన్ను వేశారు అని అంటున్నారు.

ఇక్కడ నుంచి గంటా వేరే సీటుకు షిఫ్ట్ అయితే శ్రీ భరత్ పోటీకి వస్తారని అంటున్నారు. నగరానికి నడిబొడ్డున ఉన్న ఈ సీటులో టీడీపీకి సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది, క్యాడర్ ఫుల్ గా ఉంది. సరైన నాయకుడు దొరికితే ఈ సీటులో గెలుపు సాధ్యమని అంటున్నారు. దాంతో ఈ మూడు సీట్ల మీద శ్రీ భరత్ టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అయితే విశాఖలో గత మూడు ఎన్నికల నుంచి వెలగపూడి రామక్రిష్నబాబు విశాఖ తూర్పు నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. శ్రీభరత్ అసెంబ్లీ బరిలోకి వస్తే మాత్రం వెలగపూడికి ఈసారి పోటీ చేసే చాన్స్ ఉండదని అంటున్నారు. దానికి సామాజిక సమీకరణలు కారణం అని అంటున్నారు.

ఏడు సీట్లు ఉన్న విశాఖ జిల్లాలో రెండు సీట్లు కమ్మలకు ఇవ్వడానికి సోషల్ ఇంజనీరింగ్ దృష్ట్యా టీడీపీలో వీలు పడదని అంటున్నారు. అందుకే వెలగపూడి ప్లేస్ లో బీసీలకు తూర్పుతో టికెట్ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి శ్రీ భరత్ అసెంబ్లీకి రావడం అంటే వెలగపూడి సీటుకు డైలామాలో పెట్టినట్లే అంటున్నారు. మరి శ్రీ భరత్ ఎంపీగా పోటీ చేస్తారా లేక మూడు సీట్లలో ఎక్కడ ఎమ్మెల్యేగా చేస్తారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉందిపుడు.

Tags:    

Similar News