స్టీల్ ప్లాంట్ ప్రైవేటు మీద కేంద్రం వెనకడుగు నిజమేనా....?
దీని మీద బీజేపీకి చెందిన రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పుకొచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం అన్న అంశం మీద కేంద్రం వెనకడుగు వేసిందా అన్న చర్చ జరుగుతోంది. దీని మీద బీజేపీకి చెందిన రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పుకొచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడిప్పుడే జరగదు అని అంటున్నారు ఆయన. ప్రస్తుతం ఈ అంశం నిశ్చలస్థితి లో ఉందని కూడా తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభసాటిగా నడిపించాలి అనేది మా ప్రయత్నం అని ఎంపీ చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అన్ని అంశాలను పార్లమెంట్ లో ప్రశ్నలుగా అడిగానని ఆయన చెప్పడం విశేషం.
స్టీల్ ప్లాంట్ కు అవసరం అయ్యే ఐరన్ ఓర్ కోసం గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ మీద విమర్శలు చేశరు. అంతే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఒక గాడిన పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆయన అంటున్నారు. ప్లాంట్ ను యాజమాన్యం పట్టించుకోలేదని జీవీఎల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అంతే కాదు స్టీల్ ప్లాంట్ లాభాల లో ఉన్నది వాస్తవం కాదని మరో బాంబు పేల్చారు.
అంటే స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉండబట్టే ప్రైవేటీకరణ అన్న అంశాన్ని ముందుకు తెచ్చామనిచెప్పడమే ఆయన ఉద్దేశ్యంగా ఉంది అంటున్నారు. ఇక గతంలో ఎన్నో తప్పిదాలు జరిగాయని అందువల్ల స్టీల్ ప్లాంట్ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని జీవీఎల్ అంటున్నారు. తాము విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఒక గాడిలో పెడతామని ఆయన అంటున్నారు. మరి గాడిలో పెట్టడం అంటే ప్రైవేటీకరణ వాయిదా వేసి ఏమి చేస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది.
ఇక త్వరలోనే స్టీల్ ప్లాంట్ సమస్యను ప్రధాని దృష్టి కి తీసుకు వెళతానని ఆయన్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం 30 వేల ఉద్యోగస్తులకు మాత్రమే కాదని ఇది ప్రజల ఆస్తి అంటూ జీవీఎల్ సంచనల కామెంట్స్ చేశారు అదే విధంగా స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి పరిచే అన్ని ప్రక్రియలు కేంద్రం చేస్తోందని బీజేపీ ఎంపీ చెప్పుకున్నారు. రోజుకు మూడు ర్యాకులు బొగ్గు ను ఎన్ ఎమ్ డి సి నుంచి విశాఖ స్టీల్ కు అందిస్తోందని తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని అంటున్నారు. మొత్తానికి చూస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వచ్చే ఎన్నికల వరకూ వాయిదా వేసుకుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.