గొడవపడ్డ నెక్స్ట్ డే రాజు గారి కాళ్లు పట్టుకున్నా..!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆర్య. గంగోత్రి సినిమా చేసిన అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య.

Update: 2024-05-08 04:41 GMT

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆర్య. గంగోత్రి సినిమా చేసిన అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఆర్య సినిమా ఎంతోమంది జీవితాలను మార్చేసింది. నిర్మాతగా దిల్ రాజుకి.. డైరెక్టర్ గా సుకుమార్ కి.. హీరోగా అల్లు అర్జున్ కి.. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ కి.. ఇలా అందరికీ ఈ సినిమా తమ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఆర్య రిలీజై 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో ఆర్య కు పనిచేసిన టీం అంతా కూడా అటెండ్ అయ్యారు.

ఈవెంట్ లో సుకుమార్ ఆర్య షూటింగ్ టైం లో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. మొదటి సినిమా కాబట్టి ప్రతి విషయం గుర్తుంది.. సినిమా విషయంలో రాజు గారి నిజాయితీ నచ్చింది. దిల్ సినిమా హిట్ అయితే నీతో సినిమా చేస్తా అన్నారు అనుకున్నట్టుగా దిల్ హిట్ అయ్యింది. నన్ను పిలిచి సినిమా చేద్దాం అన్నారు. ఆ టైన్ లో నాకు ఒక రీమేక్ స్క్రిప్ట్ ఇచ్చారు. దాన్ని ఏమాత్రం ఆలోచించకుండా రిజెక్ట్ చేశా.. నేను చేసిన మోంటేజ్ లు చూసి కథ వినడానికి ఆసక్తి చూపించారు. ఏమాత్రం అనుభవం లేని నాకు ధైర్యంతో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఆ ఛాన్స్ ఇచ్చిన రాజు గారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని అన్నారు సుకుమార్.

ఇక ఇదే సందర్భంలో ఆర్య హీరో అల్లు గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాతో తన భవిష్యత్తు తానే వెతుకున్నాడు బన్నీ.. కథ చెప్పాక చాలా అడ్డంకులు వచ్చాయి. కథ తనకు నచ్చింది తన ఫ్యూచర్ అందులో ఉందని నమ్మాడు అందుకే అందరినీ ఒప్పించి సినిమా చేయించుకున్నాడు బన్నీ. అప్పటి నుంచి రీల్ అండ్ రియల్ లైఫ్ లో తనతో పాటు ఉన్నందుకు అల్లు అర్జున్ కి థాంక్స్ చెప్పారు సుకుమార్.

దిల్ రాజు గారికి కథ చెప్పినప్పుడే టాప్ టెక్నిషియన్స్ కావాలని కోరాను. ముందు తన ఆలోచనలో ఉన్న సీకే ప్రసాద్, దేవి శ్రీ ప్రసాద్, రత్నవేలు ఇలా ముగ్గురిని అడిగా.. వాళ్లను సమకూర్చారు దిల్ రాజు. సినిమా ఫస్ట్ హాఫ్ విని దేవి ఫీల్ మై లవ్ ట్యూన్ ఇచ్చేశాడు. తనకు సంగీతం అంటే దేవినే.. తన వాయిస్ తోనే ఏదైనా జరుగుతుందని నమ్ముతానని అన్నారు సుకుమార్. సినిమాలో నటించిన శివ బాలాజి గురించి చెబుతూ.. శివ బాలాజీ సెకండ్ లీడ్ అనగానే కాస్త కోపంగా ఉండేవాడు. ఈ రోల్ యాక్సెప్ట్ చేసినందు శివ బాలాజీకి థ్యాంక్స్ చెప్పారు సుకుమార్.

ఆర్య సినిమా అ అంటే అమలాపురం సాంగ్ గురించి చెబుతూ.. నా సినిమాలో ఐటెం సాంగ్ పెట్టకూడదు అనుకున్నా.. దిల్ రాజు గారు పట్టుపట్టించి ఆ అంటే అమలాపురం పాట పెట్టించారు. లిరిక్ లో ఒకచోట అల్లు వారి పిల్లగాడా అని వస్తుంది. నా హీరో ఆర్య కదా అల్లు వారి పిల్లగాడా ఏంటని రాజు గారితో గొడవపడ్డా.. కానీ ఐటెం సాంగ్ ఇచ్చే వైబ్ చూసి నేను ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ పెడుతూ వచ్చాను. అప్పుడు ఐటెం సాంగ్ కావాలని పట్టుబట్టిన దిల్ రాజు ఆ తర్వాత కళాత్మక సినిమాలు చేస్తూ వాటిని వదిలిపెట్టారు. కానీ తాను మాత్రం వాటిని కొనసాగిస్తూ వస్తున్నానని అన్నారు సుకుమార్.

ఆర్య సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఎలాంటి అనుభవం లేని తనకు షూటింగ్ టైం లో చాలా విషయాలు రత్నవేలు చెప్పారని అన్నారు సుకుమార్.

సినిమా లో ఒక మాంటేజ్ కోసం రాజు గారిని అడిగితే అప్పటికే సినిమాకు చాలా రోజులు తీసుకున్నావ్.. బడ్జెట్ కూడా ఎక్కువైందని అరిచారు. ఇద్దరం గొడవపడ్డాం.. కానీ ఆ మాంటేజ్ షాట్ ఎలాగైనా కావాలని అనుకున్నా.. అందుకే అరుచుకున్న తర్వాత రాజు గారు కాళ్లు పట్టుకున్నా.. డైరెక్టర్ అంటే పొగరుగా ఉంటారు. షూట్ క్యాన్సిల్ చేస్తారని అంటారు. కానీ ప్రొడక్ట్ సరిగా రావడం కోసం తాను కాంప్రమైజ్ అవుతానని అన్నారు. ఆర్య టైం లో తాను రాజు గారి కాళ్లను మూడు సార్లు పట్టుకున్నానని అన్నారు సుకుమార్.

ఆర్య సినిమా కథ చిరంజీవి గారికి చెప్పినప్పుడు అల్లు అరవింద్ గారు 15 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు. కానీ కథ చెబుతూ 3 గంటల దాకా టైం తీసుకున్నా.. కథ చెప్పే టైం లో టేబుల్ మీద ఉన్న టీ గ్లాసులు, ఏనుగు బొమ్మ చిరంజీవి గారు తీసి పక్కన పెట్టారని గుర్తు చేసుకున్నారు సుకుమార్. ఆ టైం లో చిరంజీవి గారు కూడా సినిమా పక్కా హిట్ అవుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా ఆర్య టీంని స్టేజ్ మీదకు పిలిచి సినిమాకు వారి సహకారం గురించి చెప్పారు సుకుమార్. వీళ్ల వల్లే సినిమా అంత బాగా వచ్చిందని.. వీళ్లు ఎవరు లేకపోయినా సినిమా బాగా వచ్చేది కాదని దానికి వీరందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు సుకుమార్.

Tags:    

Similar News