ఉద్యోగులకు ఫ్రీ మీల్స్ వెనుక గూగుల్ సీఈవో సీక్రెట్ వెలుగులోకి..!

అవును.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా "ది డేవిడ్ రూబెన్ స్టెయిన్ షో: పీర్ టు పీర్ కాన్వర్జేషన్" పాల్గొన్నారు.

Update: 2024-10-22 13:30 GMT

ఏ సంస్థ అయినా ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో కచ్చితంగా రిటన్ గిఫ్ట్ ఆశించే ఇస్తాయని అంటుంటారు చాలా మంది అనుభవం ఉన్న ఉద్యోగులు. అది తప్పు కూడా కాదు! ఉద్యోగస్తులకు వేలు, లక్షల జీతాలు ఇచ్చే సంస్థలు కచ్చితంగా రిటన్ గిఫ్ట్ ఆశించాలి! ఈ విషయంలో గూగుల్ మరింత వ్యూహాత్మకంగా.. అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా "ది డేవిడ్ రూబెన్ స్టెయిన్ షో: పీర్ టు పీర్ కాన్వర్జేషన్" పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతీరోజూ మనం ఆహారం కోసం ఇంత ఖర్చు చేస్తున్నామా.. అనే లెక్కలు తిరిగి పొందే ఉత్పాదకతను ఎలా అంచనా వేస్తారు అనే ప్రశ్నను ఎదుర్కొన్నారు పిచాయ్. దీనికి ఆసక్తికరంగా సమాధానం చెప్పారు.

ఇందులో భాగంగా... సంస్థకు సంబంధించిన కేఫ్ లలో జరిగే అనధికారిక చర్చల్లో వినూత్న ఆలోచనలు పుట్టుకొస్తాయని.. ఆ వాతావరణం క్రియేటివ్ ఆలోచనలను పెంచుతుందని.. సొసైటీని నిర్మిస్తుందని పిచాయ్ తెలిపారు. ఈ విధంగా... గూగుల్ ఎంప్లాయిస్ కు అందించే ఉచిత భోజనం సదుపాయం వెనుక అసలు రహస్యాన్ని బయట పెట్టారు.

ఇదే సమయంలో తాను గూగుల్ లో మొదట్లో పనిచేసే రోజుల్లో.. కేఫ్ లో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు కలుసుకుని మాట్లాడుకున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్న సందర్బాలు చాలా గుర్తు చేసుకోగలని.. ఇది సృజనాత్మకతను ప్రేరేపిస్తుందని వెల్లడించారు. ఈ విషయంలో సంస్థకు ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని సుందర్ పిచాయ్ తెలిపారు.

కాగా... ప్రస్తుతం 1,82,502 మంది ఉద్యోగులను కలిగి ఉన్న గూగుల్ భారీ ఆఫర్స్ తో మోస్ట్ టాలెంటెడ్ పీపుల్స్ ని ఆకర్షిస్తుంటుంటుంది. ఈ సంస్థలో ఉద్యోగులు.. వెల్ నెస్ ప్రోగ్రామ్స్, ఆన్ సైట్ ఫిట్ నెస్ సెంటర్స్ తో పాటు మెడికల్, విజన్ కవరేజీని కలిగి ఉన్న సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ని కూడా ఆనందిస్తుంటారు! అయితే... సుందర్ పిచాయ్ మీల్స్ విషయంలో చెప్పిన లాజిక్ ఈ సౌకర్యాలకు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది తెలియాల్సి ఉంది!

Tags:    

Similar News