ఏపీ హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె!

ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఎంతటి చర్చనీయాంశమైన, సంచలనమైన విషయం అనేది తెలిసిందే.

Update: 2024-08-07 07:43 GMT

ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఎంతటి చర్చనీయాంశమైన, సంచలనమైన విషయం అనేది తెలిసిందే. ప్రధానంగా గత ఎన్నికల సమయంలో ఈ విషయంపై ప్రధానంగా కడప జిల్లాలో రాజీయ విమర్శలు పీక్స్ కి చేరాయి. వాటి ప్రభావం రాష్ట్రమంతా చూపించిన పరిస్థితి. ఆ సమయంలో వివేకా కుమార్తె సునీత, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని షర్మిళ, సునీత ధ్వయం విరుచుకుపడింది! అయితే ఎన్నికలు పూర్తయ్యి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ విషయం ఇప్పటికే చంద్రబాబు ఈ విషయంపై స్పందించారు. "హూ కిల్డ్ బాబాయ్" అనే ప్రశ్నకు త్వరలో సమాధానం వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వివేకా కుమార్తె సునీత.. ఏపీ హోంమంత్రి అనితను కలిశారు.

అవును... వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె ఈ సందర్భంగా మంత్రికి వివరించారని తెలుస్తోంది. వివేకా హత్య తదనంతర పరిణామాలను ఆమె హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో హంతకులకు అండగా స్థానిక పోలీసులు నిలిచారని ఆమె ఆరోపించారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో... నాటి ప్రభుత్వ హయాంలో హంతకులకు అండగా నిలిచిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని ఏపీ హోంమంత్రిని సునీత కోరారని సమాచారం. ఈ సందర్భంగా స్పందించిన హోంమంత్రి అనిత... ఈ కేసు సీబీఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు! ఇదే సమయంలో... తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు.

Tags:    

Similar News