వైఎస్ వెంకటరెడ్డి గనుల లీజు నిలిపివేత

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమీప బంధువు వైఎస్ వెంకట్ రెడ్డికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

Update: 2025-01-30 10:18 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమీప బంధువు వైఎస్ వెంకట్ రెడ్డికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైఎస్సార్ కడప జిల్లా వేములలో ఆయనకు కేటాయించిన బైరటీస్ గనుల లీజును తాత్కాలికంగా నిలిపివేసింది. గనుల మంత్రి రవీంద్రకు తెలియకుండా ఆ శాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయొద్దంటూ ఆదేశాలు విడుదలయ్యాయి.

గత ప్రభుత్వంలో తనకు బైరటీస్ గనులు కేటాయించాలని వైఎస్ వెంకటరెడ్డి చేసుకున్న దరఖాస్తును ఆమోదిస్తూ ఈ నెల 15న గనులశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదమైంది. ప్రస్తుత ప్రభుత్వానికి సమాచారం లేకుండా, మంత్రికి తెలియకుండా వెంకటరెడ్డికి గనులు ఎలా కేటాయిస్తారని టీడీపీ నేతలు లేవనెత్తారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో మంత్రి కొల్లు రవీంద్ర వెంటనే స్పందించారు.

వైఎస్సాఆర్ జిల్లా వేములలో 9.55 హెక్టార్లలో బైరటీస్ తవ్వేందుకు వెంకటరెడ్డికి అనుమతి లభించింది. గనులశాఖ డైరెక్టర్ విచక్షణాధికారంతో వెంకటరెడ్డి దరఖాస్తును పరిశీలించి ఆయన కోరిన భూములను లీజుకిచ్చారు. ఈ లీజు పత్రాలను లీజుదారుడు, మైనింగ్ ఏడీ సంయుక్తంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. అప్పుడే లీజుకు ఒప్పందం కుదిరి చట్టబద్ధత వస్తుంది. అయితే ప్రభుత్వానికి తెలియకుండా గనులను లీజుకివ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ప్రక్రియను నిలిపేయాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు.

Tags:    

Similar News