సీజ్ ద ముంతాజ్ హోటల్... పవన్ కు బిగ్ డిమాండ్!
ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయాలు వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయాలు వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఆధ్యాత్మిక నగరంలో తాజాగా ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ముంతాజ్ హోటల్ అనే విషయం తెరపైకి వచ్చింది.
అవును.... అలిపిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన భవనం ఎదుట ముంతాజ్ హోటల్ కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని తెలుస్తోంది. ఈ చర్యను ఖండిస్తూ.. హిందూ సంఘాలు, స్వామీజీలు తాజాగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించిందని అంటున్నారు. అయితే.. ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు.
ఈ సందర్భంగా... తిరుమల ఏడుకొండలను రక్షించుకుందామంటూ నినాదంతో దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో.. తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు, సనాతన ధర్మం అని చెబుతున్న పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు.
ఇందులో భాగంగా... సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కల్యాణ్? తిరుమల ఏడు కొండలకు వెన్నుపోటు పొడుస్తున్నరా.. తిరుమల ప్రక్షాలన అంటే... ముంతాజ్ హోటల్ నిర్మించడమా? శేషాద్రి పర్వతం అంచున అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడమా? అంటూ ఫ్లాకార్డ్లు ప్రదర్శించడం ఇప్పుడు వైరల్ గా మారింది.