కేజ్రీ ఓటమి.. మలీవాల్ కౌరవ సభలో ద్రౌపది పోస్ట్.. ఏమిటీ గొడవ

ఇప్పుడు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి నేపథ్యంలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Update: 2025-02-08 15:09 GMT

స్వపక్షంలోనే విపక్షం అంటే..? ఢిల్లీ రాజకీయాల్లో ఆమెను చూస్తే తెలుస్తుంది.. మహిళా కమిషన్ చైర్ పర్సన్.. ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వం వంటి పదవులు దక్కినా చివరకు ఆమె పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి నేపథ్యంలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

స్వాతి మలీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రాజ్యసభ సభ్యురాలు. అయితే, ఆ తర్వాత ఆప్ తో సఖ్యతగా లేరు. ఎన్నికల్లో పార్టీతో పాటు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ కూడా ఓడిపోవడంతో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆప్ వ్యవస్థాపకుడైన కేజ్రీని ఆమె పోల్చిన వైనమే చర్చనీయంగా మారింది.

కానీ, కేజ్రీని టార్గెట్ చేస్తూ స్వాతి మలీవాల్‌ ట్వీట్ చేశారు. అందులో కౌరవ మహాసభలో ‘ద్రౌపది వస్త్రాపహరణం’కు సంబంధించిన ఫొటో షేర్‌ చేశారు. న్యూఢిల్లీ సీటు నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్‌ 3వేల ఓట్ల తేడాతో ఓడిపోగా, కీలక నేతలు మనీశ్‌ సిసోడియా, సత్యేందర్ జైన్‌ కూడా పరాజయం పాలయ్యారు.

మలీవాల్‌ పై కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ గతంలో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. బిభవ్ తనపై విచక్షణారహితంగా దాడి చేశాడని.. స్వాతి ఆరోపించారు. ఇది ఆప్ లో ప్రకంపనలు రేపింది. అప్పటివరకు ఆప్ వాయిస్ గా ఉన్న మలీవాల్.. ఈ ఘటన తర్వాత పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు కేజ్రీ ఓటమిని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టడం చర్చనీయమైంది.

స్వాతి మలీవాల్ పోస్టు అర్థం ఏమంటే.. తనపై బిభవ్ దాడి చేస్తున్నా.. కౌరవ సభలోని ధ్రుతరాష్ట్రుడు, భీష్ముడు తదితర పెద్దల్లా ఆప్ కీలక నాయకులు చూస్తూ మిన్నకున్నారని.

Tags:    

Similar News