జగన్ ఇంటిపక్క రోడ్డుకు విడుదల... వీడియో వైరల్!

ఇందులో భాగంగా జగన్ ఇంటి పక్కన ఉన్న రోడ్డుపై ఆంక్షలు ఎత్తేశారు. దీంతో... ఈ విషయం స్పందిస్తూ, వీడియోలు పెడుతున్నారు స్థానికులు.

Update: 2024-06-18 07:20 GMT

ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారుతుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం ముందు ఉన్న రహదారికి విడుదల అంటూ ఉన్న ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదే సమయంలో ఈ వీడియోలో దర్శనమిస్తున్న జగన్ నివాసం, దాని చుట్టూ ఉన్న ఇనుప కంచె కూడా పలు కామెంట్లను సొంతం చేసుకుంటుంది. అసలు ఈ కథాకమీషేమిటో ఇప్పుడు చూద్దాం...!

అవును... 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ 151 సీట్ల క్లీన్ మెజారిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లిలో ఆయన ఇంటి పక్కనే నిర్మించిన నాలుగు వరసల రోడ్డుతో పాటు దానిపక్కనే ఉన్న కాలువ కట్ట రహదారిపైనా ఆంక్షలు విధించారు. ఫలితంగా తాడేపల్లి, సమీప గ్రామాలవారు తమ సొంతిళ్లకు కూడా స్వేచ్ఛగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

అయితే... తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితమైపోయింది. దీంతో... జగన్ కు ముఖ్యమంత్రి హోదా పోవడంతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా లేని పరిస్థితి! ఈ నేపథ్యంలో... జగన్ ఇంటిపక్కనే ఉన్న రోడ్డుకు విడుదల లభించింది. ఇందులో భాగంగా జగన్ ఇంటి పక్కన ఉన్న రోడ్డుపై ఆంక్షలు ఎత్తేశారు. దీంతో... ఈ విషయం స్పందిస్తూ, వీడియోలు పెడుతున్నారు స్థానికులు.

ఇందులో భాగంగా... స్థానిక అపార్ట్మెంట్లలోని వాసులు, రైతులు, వ్యాపారులు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల ఆంక్షలు తొలగిపోయి రాకపోలకు మార్గం సుగమం అవ్వడంపై ఆనందంగా స్పందిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ఇంటి చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్ ను వీడియో షూట్ చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

కాగా... 2019లో జగన్ ముఖ్యమంత్రి కాగానే తన ఇంటి వెనుక ఉన్న నాలుగు వరుసల మార్గంతో పాటు బకింగ్ హోం కెనాల్ పై ఉన్న కాలువ కట్ట రోడ్డునూ మూసేసి భదరతా సిబ్బందిని నియమించారు. దీంతో... సుమారు 1.5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేదని చెబుతున్నారు.

Tags:    

Similar News