నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డ్... చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఇదే సమయంలో దేవాన్ష్ సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్టాత్మక "వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ - లండన్" అధికారికంగా ధృవీకరించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి చంద్రబాబు నాయుడి మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. దీంతో... నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా లోకేష్ పుత్రోత్సాహం వ్యక్తం చేయగా.. మనవడి సక్సెస్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలువురు మంత్రులు అభినందనలు తెలిపారు.
అవును... నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. చెస్ లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించడం ద్వారా తొమ్మిదేళ్ల వయసులోనే "ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ - 175 పజిల్స్" రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో దేవాన్ష్ సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్టాత్మక "వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ - లండన్" అధికారికంగా ధృవీకరించింది.
"5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్" అనే పుస్తకం నుంచి తీసుకున్న పజిల్స్ తో ఈ పోటీని రూపొందించారు. దేవాన్ష్ ఇటీవల 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్ ని కేవలం 1.:43 నిమిషాల్లో పూర్తి చేశడు. ఇదే సమయంలో.. 9 చెస్ బోర్డుల్ని కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. ప్రతీ బోర్డులోనూ 32 పావుల్ని సరైన స్థానంలో వేగంగా ఉంచాడు.
ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... "నిన్ను చూసి గర్విస్తున్నాను.. నా చిన్ని గ్రాండ్ మాస్టర్" అని ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో... కఠోరశ్రమ, అంకితభావం, పట్టుదల విజయానికి కీలకం అని.. ఈ విజయం అంద్కొవడానికి దేవాన్ష్ నెలల పాటు శ్రమించాడని పేర్కొన్నారు.
ఇదే సమయంలో... "ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ - 175 పజిల్స్" గా ప్రపంచ రికార్డ్ సాధించడంపై దేవాన్ష్ తండ్రి నారా లోకేష్ స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మకమైన ప్రదర్శనల నుంచి దేవాన్ష్ ప్రేరణ పొందాడని.. అతడికి చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు.
మరోపక్క... ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని.. ప్రపంచస్థాయి ఆటగాడిగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఏపీ మంత్రులు అభినందనలు తెలిపారు!