టార్గెట్ కేజ్రీవాల్!
నరేంద్రమోడీ తన టార్గెట్ ను చాలా స్పష్టంగానే పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లోగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఏదో ఒకటి చేయాలని మోడీ గట్టిగా ఫిక్సయినట్లే ఉన్నారు.
నరేంద్రమోడీ తన టార్గెట్ ను చాలా స్పష్టంగానే పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లోగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఏదో ఒకటి చేయాలని మోడీ గట్టిగా ఫిక్సయినట్లే ఉన్నారు. కాకపోతే ఏమిచేయాలో అర్ధంకాక కేజ్రీవాల్ కు సన్నిహితంగా ఉన్న వాళ్ళని ముందుగా టార్టెట్ చేసి అరెస్టులు చేస్తున్నారు. అంటే డైరెక్టుగా మోడీ రంగంలోకి దిగటంలేదు. దర్యాప్తు సంస్ధల ద్వారా పని పూర్తి చేయాలని చూస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్టుచేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితులు ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా, మాజీమంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్టుచేసిన విషయం తెలిసిందే. చాలాకాలంగా వీళ్ళిద్దరు జైలులోనే ఉన్నారు. వీళ్ళకి అదనంగా ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇపుడు తోడయ్యారు. మోడీకి కేజ్రీవాల్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. దేశంలోని అనేకమంది ముఖ్యమంత్రులు ఏదో రూపంలో మోడీకి దాసోహం అనేశారు.
అయితే ఎంత ప్రయత్నిస్తున్నా కేజ్రీవాల్ మాత్రం దారిలోకి రావటంలేదు. ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అనేక అధికారాలను కేంద్రప్రభుత్వం ఈమధ్యనే కోత విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అధికారాల్లో చాలావరకు కేంద్రప్రభుత్వమే ప్రత్యేక బిల్లుపెట్టి లాగేసుకున్నది. అయినా సరే కేజ్రీ కేంద్రానికి లొంగలేదు. పైగా ఇండియాకూటమిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇది మోడీని మరింతగా మండించింది. అందుకనే కేజ్రీవాల్ టార్గెట్ గా కేంద్ర దర్యాప్తుసంస్ధల వేట కొనసాగుతోంది.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోగా ఆప్ ప్రభుత్వాన్ని లేకపోతే కేజ్రీవాల్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలన్నది మోడీ టార్గెట్ గా కనబడుతోంది. ఇప్పటికి మూడుసార్లు ఢిల్లీకి కేజ్రీ ముఖ్యమంత్రయ్యారు. ఆప్ చేతిలో బీజేపీ రెండుసార్లు చావుదెబ్బ తిన్నది. ఈ విషయమే మోడీకి మింగుడుపడటంలేదు. అందుకనే ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా కేజ్రీవాల్ ను దర్యాప్తు సంస్ధలు టార్గెట్ చేస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కేజ్రీవాల్ ను ఈడీ విచారించింది. మరోసారి విచారణకు రెడీ అవుతున్నట్లు సమాచారం. చివరకు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.