అక్కడ సైకిల్ ని తొక్కేస్తున్న జనసేన?
సరే ఆ సంగతి అలా ఉంచితే ఏపీలో టీడీపీ కూటమి అంతా సజావుగా చక్కగా ఉందా అంటే లేదు అన్న మాటే ఉంది.
ఏపీలో పై లెవెల్ లో కూటమి బాగానే ఉంది అని నిన్నటి వరకూ అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం శాఖ పనితీరు మీద చేసిన కామెంట్స్ చూస్తే సంథింగ్ ఏదో జరుగుతోంది అన్న భావన అయితే అందరిలో ఏర్పడింది.
సరే ఆ సంగతి అలా ఉంచితే ఏపీలో టీడీపీ కూటమి అంతా సజావుగా చక్కగా ఉందా అంటే లేదు అన్న మాటే ఉంది. ప్రతీ నియోజకవర్గంలోనూ టీడీపీ జనసేనల మధ్యన వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ వర్సెస్ జనసేన అన్నట్లుగా ఒక రచ్చ సాగింది.
అదే పిఠాపురంలోనూ జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా అక్కడ పరిస్థితి ఉంది. ఇది అన్ని చోట్లా కనిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తమ ఆధిపత్యం చూపిస్తున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట సహజంగానే వారిదే పైచేయిగా ఉంటోంది.
మరి మాకేది రాజకీయ వాటా అన్నట్లుగా రెండవ వర్గం రగడ చేస్తోంది. అదే చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా నెల్లిమర్లలో అయితే ఏకంగా జనసేన ఆధిపత్యం ఒక లెవెల్ లో అన్నట్లుగా సాగుతోంది. అక్కడ టీడీపీని తగ్గించే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని అంటున్నారు.
జనసేన నుంచి లోకం మాధవి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె గెలుపునకు కూటమి అంతా కృషి చేసినా గెలిచిన తరువాత మాత్రం ఆమె జనసేనను బలోపేతం చేసే చర్యలను ముమ్మరం చేశారు. అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చిన వారిని తీసుకోవడం టీడీపీ నేతలను పక్కన పెట్టడం వంటివి జరుగుతున్నాయని పసుపు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కూటమిలోని రెండు పార్టీలు రోడ్డుకెక్కుతున్నాయి. అధికారులు అంతా జనసేన నేతల మాటే వినాలని కూడా ఆ పార్టీ నుంచి అనధికార సందేశాలు వెళ్లడంతో తమ్ముళ్ళు మండిపోతున్నారని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే చెప్పినదే వేదం అన్నట్లుగా సాగిపోవడంతో టీడీపీ నెల్లిమర్ల ఇంచార్జి కర్రోతు బంగార్రాజు వర్గం అంతా గుర్రు మీద ఉంది అని అంటున్నారు. టీడీపీ నేతల కంటే వైసీపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తూ వారి మాటకే విలువ ఇస్తూ ఎమ్మెల్యే టీడీపీని అణగదొక్కుతున్నారు అని సైకిల్ పార్టీలో తీవ్రమైన చర్చ సాగుతోంది.
నిజానికి చూస్తే నెల్లిమర్లలో టీడీపీ బలంగా గ్రాస్ రూట్ లెవెల్ దాకా ఉంది. జనసేనకు ఈ సీటు ఖరారు అయిన నేపథ్యంలో టీడీపీ నేతలు అధినాయకత్వం మాటను మన్నించి చిత్తశుద్ధితో పనిచేశారు. అలా కాకుండా ఉంటే 2019లో జనసేనకు వచ్చిన ఏడు వేల ఓట్లే మళ్లీ వచ్చేవని టీడీపీ నేతలు అంటున్నారు.
తమ బలంతో గెలిచి తమనే అణగదొక్కాలని చూడడం ఏ రకమైన పొత్తు ధర్మం అని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లోకం మాధవి వర్సెస్ బంగార్రాజు గా నెల్లిమర్ల రాజకీయం స్టార్ట్ అయిపోయింది. అది ఎంత దాకా వచ్చింది అంటే ఎమ్మెల్యే మీటింగులనే బహిష్కరించాలని కూడా టీడీపీ నేతలు నిర్ణయించడం వరకూ అని అంటున్నారు.
ఈ పరిణామాలను టీడీపీ నేతలు తమ హై కమాండ్ దృష్టికి తెస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే టీడీపీని దెబ్బ తీయాలన్న పట్టుదలతో జనసేన పనిచేస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక నెల్లిమర్లలో కూటమి రాజకీయం సలసల మరుగుతోంది.