టీడీపీలో ఎన్నారైలకు పెద్ద పీట.. తమ్ముళ్ల మాటేంటి ..!
ఇటీవల తన నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకొనేందుకు అనంతపురం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజధానికి వచ్చారు.
టీడీపీలో ఇటీవల కాలంలో ఎన్నారై నాయకులకు పెద్ద పీట వేస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఓ ఎన్నారైతో రోజు రోజంతా గడిపారు. `సీఎం చంద్రబాబుతో ఒకరోజు` అనే కార్యక్రమాన్ని తెరమీదికి తీసుకు వచ్చి.. సదరు ఎన్నారైని రోజు రోజంతా తనతో తిప్పుకొన్నారు. ఈ వ్యవహారం.. పార్టీలో చర్చకు వచ్చింది. తమకు కనీసం అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వడం లేదని క్షేత్రస్థాయిలో నాయకులు వ్యాఖ్యానిస్తున్నా రు. కానీ, ఎన్నారైలకు రోజు రోజంతా ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల తన నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకొనేందుకు అనంతపురం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజధానికి వచ్చారు. కానీ, వారికి అప్పాయింట్‌మెంటు లభించలేదు. అదే రోజు ఎన్నారైకి సీఎం చంద్రబాబు రోజు రోజంతా తనతో ఉండి పాలనా కార్యక్రమాలను పరిశీలించే అవకాశం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. మౌనంగా వెళ్లిపోయారు. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం వారు అసంతృప్తిగానే ఉన్నారు.
ఇక, రాజ్యసభ కోటాలో కాకినాడకు చెందిన ఎన్నారై సానా సతీష్‌కు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. దీనిని కూడా లోకల్‌గా ఉండేవారు వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం .. త్యాగాలు చేసినత మను కాదని ఎన్నారైకి టికెట్ ఇవ్వడం ఏంటన్నది వారి ప్రశ్న. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు టికెట్లు త్యాగాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పుడు రాజ్యసభకు ఎన్నారైని పంపిస్తుండడం పట్ల వారంతా ఆగ్రహంతో ఉన్నారు. అయితే.. పార్టీ అధినేత వాదన మరో విధంగా ఉంద. ఎన్నికల సయమానికి ముందు నుంచి కూడా ఎన్నారైలు.. పార్టీ కోసం.. పనిచేశారని, వారిని తగిన విధంగా గౌరవించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అందుకే వారికి టికెట్ ఇచ్చామని అంటున్నారు. కానీ, దీనిని సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదిమున్ముందు ప్రభావం చూపుతుందా? లేదా? అనేది చూడాలి.