బాలకృష్ణ ఓవరేక్షన్.. చంద్రబాబు డైరెక్షన్... ఇది పూర్ సెలక్షన్!

అసెంబ్లీలో టీడీపీ దందా... స్పీకర్ పోడియం వద్ద రౌడీయిజం!

Update: 2023-09-21 08:36 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు చంద్రబాబు. మరోపక్క ఆయన బెయిల్ కోసం పిటిషన్స్ వేస్తున్నారు ఆయన తరుపు న్యాయవాదులు! ఈ సమయంలో అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి. దీంతో... చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ టీడీపీ నేతలు రచ్చ మొదలుపెట్టారు!

అవును... ఏపీ అసెంబ్లీలో మిగిలిన బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చలు తర్వాత అన్నట్లుగా ప్రవర్తిస్తూ.. ముందు చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ వాయిదా తీర్మానన్ని స్పీకర్ తిరస్కరించడంతో మరింత రెచ్చిపోయారు. దీంతో... వందల కోట్లు మింగి చట్టానికి దొరికిపోయిన తమ నాయకుడి అరెస్టు అంశం నుంచి సాధ్యమైనంతవరకు సానుభూతిని పొందేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందనే కామెంట్లు మొదలైపోయాయి.

వాస్తవానికి చంద్రబాబు అరెస్టును ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు పరిశీలకులు. స్వఛ్చందంగా ప్రజల నుంచి రియాక్షన్ రాలేదని అచెన్నాయుడి ఆడియోని ఉదాహరణగా చూపిస్తున్నారు. మరోపక్క... వెయ్యి ఏనుగులను తిన్న అనకొండ ఇప్పటికి చట్టానికి చిక్కింది అని జనం నవ్వుకుంటున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు!

ఈ క్రమంలో... టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారని తెలుస్తుంది. దీంతో... నిన్నమొన్నటి వరకూ గ్రామాల్లో జనాలను పోగేసి ధర్నాలు చేయించారని, ఆఖరుకు చిన్నపిల్లల్ని కూడా తమ స్వార్థానికి వాడుకుని దీక్షలు చేయించారని తీవ్ర విమర్శలు వచ్చాయి! అయినా కూడా బాబు అరెస్టుకు సరైన మైలేజీ రాలేదని భావించారో ఏమో... కానీ ఇప్పుడు ఏకంగా అసెంబ్లీనే వేదికగా ఎంచుకున్నట్లున్నారు టీడీపీ నేతలు!

ముందస్తు పథకం... బాబు దర్శకత్వం:

అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటన రాగానే జైల్లో ములాఖాత్ కు వెళ్ళిన బాలయ్య, యనమల వంటివారికి సభలో ఎలా గలాటా చేయాలన్నది బాబు డైరెక్షన్ ఇచ్చారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు లోకేష్ సైతం ఢిల్లీ నుంచి తమ శాసన సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎలా రెచ్చగొట్టాలి.. ఏమేం చేస్తే మంచి ప్రచారం వస్తుంది.. అనే అంశాలపై కూడా పథక రచన చేశారని అంటున్నారు.

ఆ పథకం ప్రకారమే బాలయ్య అసెంబ్లీలో తొడగొట్టి, మీసం తిప్పి హంగామా చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సభనుంచి బయటకు వెళ్తున్న సమయంలో సైతం... బాలయ్య వైసీపీ నేతలవైపు చూపిస్తూ అసభ్యకరంగా సంజ్ఞ చేశారు. ఇది అత్యంత పెద్ద బూతు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీంతో... ఆయనకు సామాజిక అంశాల మీద పట్టులేదు.. మాట్లాడే నేర్పు లేదు.. రాజకీయ విషయ పరిజ్ఞానం అంతకన్న లేదు.. దీంతో ఆయనకు తెల్సిన విద్య అయిన మీసం తిప్పడం, తొడగొట్టడం మాత్రమే చేశారని.. ఫలితంగా తమ అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం చేసుకోవచ్చని ప్లాన్ చేశారని, దీనికి కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం చంద్రబాబు అని అంటున్నారు!

ఈ నేపథ్యంలో... వందల కోట్ల నిధుల గోల్ మాల్ కి సంబంధించిన కేసులో చట్టానికి దొరికిన తమ నాయకుడి విషయంలో సానుభూతి పోగేసేందుకు టీడీపీ పడరాని పాట్లు పడుతోందని.. చంద్రబాబు మీద పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారని.. సభా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని.. ఇదంతా అధినేత ప్రాపకం కోసం తప్పని ప్రయత్నం అని అంటున్నారు పరిశీలకులు!

ఇక అసలు కంటే కొసరోళ్లే ఎక్కువగా హడావిడి చేస్తున్నారంటూ... వైసీపీ నుంచి బహిష్కృతమైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా పోడియం మీదకు ఎక్కి పేపర్లు లాగేసి.. మానిటర్ సైతం లాక్కునేందుకు యత్నించడం ఇక్కడ గమనార్హం! దీంతో.. చంద్రబాబు అరెస్ట్ నుంచి సాధ్యమైనంత లబ్ధి పిండుకునెందుకు టీడీపీ నేతలు పడుతున్న ఆపసోపాలు అన్నీ ఇన్నీ కాదయా అని అంటున్నారు విశ్లేషకులు!

Tags:    

Similar News