టీడీపీ జనసేన...మరో సంచలనం !

ఈ రెండు పార్టీలు కలసి ఇక మీదట ఏపీలో జేఏసీగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాయని అంటున్నారు. వైసీపీని గట్టిగా ఎదుర్కోవడానికి ఈ విధంగా జనసేన టీడీపీ ఏకం అవుతున్నాయన్న మాట.

Update: 2023-09-27 03:30 GMT

తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు విషయంలో మరో అడుగు పడింది. దాదాపుగా పదిహేను రోజుల క్రితం పవన్ పొత్తు ప్రకటన చేశారు. ఆ తరువాత ఉమ్మడి కార్యాచరణ అన్నారు. అయితే అది కాస్తా బాగా లేట్ అయింది. ఈ లోగా యనమల రామక్రిష్ణుడు రాజమండ్రి జైలులో ములాఖత్ ద్వారా చంద్రబాబుని కలసి వచ్చారు. అంతే టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయింది. మొత్తం పద్నాలుగు మందితో దీన్ని రూపొందించారు నారా లోకేష్ బాలయ్యలతో పాటు సీనియర్లు అంతా మెంబర్స్ గా ఉన్నారు.

ఈ కమిటీ తొలి సమావేశం టీడీపీ ఆఫీసులో జరిగింది. ఢిల్లీలో ఉన్న లోకేష్ వర్చువల్ గా ఈ మీటింగులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలకమైన నిర్ణయమే తీసుకున్నారు. టీడీపీ జనసేనలతో కలసి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అంటే టీడీపీ యాక్షన్ కమిటీ కి జనసేన యాక్షన్ కమిటీ మెంబర్స్ జోడు అవుతారు అన్న మాట.

ఈ రెండు పార్టీలు కలసి ఇక మీదట ఏపీలో జేఏసీగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాయని అంటున్నారు. వైసీపీని గట్టిగా ఎదుర్కోవడానికి ఈ విధంగా జనసేన టీడీపీ ఏకం అవుతున్నాయన్న మాట. ఇక క్షేత్ర స్థాయిలో రెండు పార్టీలు ఏమి చేయాలన్న దాని మీద రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయిస్తారు. కో ఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు సాగుతారు అని అంటున్నారు.

ఒక విధంగా రెండు పార్టీలు కలసికట్టుగా ఆందోళనలు చేస్తూ పోతే బంధం మరింతగా బలపడి ఓట్లు పోలరైజ్ అవుతాయని, ఉద్యమం కూడా కొత్త రూపు సంతరించుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. ఇక టీడీపీ యాక్షన్ ప్లాన్ ఇలా ఉంది. కమిటీ కూడా ప్రకటించింది. మరి ఇక చూస్తే జనసేన పొలిటికల్ యాక్షం కమిటీని ప్రకటించాల్సి ఉంది.

ఆ మీదట జేఏసీగా ఏర్పడతారు అంటున్నారు ఇవన్నీ ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే పూర్తి చేసుకుని కార్యక్షేత్రం లోకి దూకాలని చూస్తున్నారు. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర నాలుగవ విడత ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ఉంది. అలాగే లోకేష్ యువగళం పాదయాత్ర కూడా గోదావరి జిల్లాలలో ఉంది.

ఈ రెండు ప్రారంభం అయ్యే వేళకు జేఏసీ ఏర్పాటు అయితే జనసేన యాత్రలో టీడీపీ జెండాలు, నారా లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాలు కనిపిస్తాయని అంటున్నారు. మరో వైపు చూస్తే బీజేపీ లేకుండానే జనసేన టీడీపీతో పొత్తు ప్రకటన చేసింది. ఇపుడు జేఏసీ పేరుతో మరో కీలక దిశగా అడుగులు వేస్తోంది. చూడబోతే ఏపీలో బీజేపీని పక్కన పెట్టేసి రెండు ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయని అంటున్నారు. మరి ఈ పరిణామాలు ఏ రకమైన మలుపు తీసుకుంటాయో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News