బిగ్ బ్రేకింగ్... 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదల!
ఈ క్రమంలో తాజాగా 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. అంటే... ఇంకా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందన్నమ్మాట.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు తుది దశకు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా బీజేపీ - జనసేన కోసం 31 స్థానాలు వదులుకున్న టీడీపీ... ఇప్పటికే అభ్యర్థుల తొలివిడతలో భాగంగా 94 మంది పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. అంటే... ఇంకా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందన్నమ్మాట.
తాజాగా విడుదలైన జాబితా చాలా సందేహాలను నివృత్తి చేసిందనే చెప్పాలి. దెందులూరులో ఈ దఫా చింతమనేని ప్రభాకర్ కు కాకుండా మరో వ్యక్తికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని కథనాలొచ్చిన నేపథ్యంలో... ఆ విషయం కూడా క్లియర్ అయ్యింది. ఆనం రాం నారాయణ రెడ్డి పేరు.. ఈ జాబితాలో కనిపించింది. ఇదే సమయంలో గాజువాకలోనూ టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఇంతకాలం ఉన్న చిన్న చిన్న సందేహాలు ఈ దెబ్బతో క్లియర్ అయినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో 34 మందితో విడుదలైన టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ఈ విధంగా ఉంది!
గాజువాక - పల్లా శ్రీనివాసరావు
చోడవరం – కే.ఎస్.ఎన్.ఎస్. రాజు
మాడుగుల - పైలా ప్రసాద్
నరసన్నపేట - బగ్గు రమణ మూర్తి
రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్
ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ
రంపచోడవరం - మిర్యాల శిరీష
రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
దెందులూరు - చింతమనేని ప్రభాకర్
గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు
కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు
పెదకూరపాడు - భాష్యం ప్రవీణ్
గుంటూరు ఈస్ట్ - మహ్మద్ నజీర్
గుంటూరు వెస్ట్ - పిడుగురాళ్ల మాధవి
కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు
గురజాల - యరపతినేని శ్రీనివాసరావు
గిద్దలూరు - అశోక్ రెడ్డి
మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి
కోవూరు - వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఆత్మకూరు - ఆనం రాంనారాయణ రెడ్డి
కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి
వెంకటగిరి - కురుగొండ్ల లక్ష్మీప్రియ
ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి
నందికొట్కూరు (ఎస్సీ) - గిత్తా జయసూర్య
మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి
కదిరి - కందికుంట యశోదా దేవి
పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి
మదనపల్లి – షాజహాన్ బాషా
పుంగనూరు - చల్లా రామచంద్రా రెడ్డి
శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
చంద్రగిరి - పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
సత్యవేడు - కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
పూతలపట్టు – డాక్టర్ కలికిరి మురళీ మోహన్